ఆత్మసంయమ యోగము
భగవద్గీత
అలా కాక అనాత్మ నస్తు - ఉపాధులు నీకు వశం కాలేదో వాటికే నీవు వశమైపోయావో. శత్రుత్వే వర్తేతా త్మైవ శత్రువత్ - ఒక శత్రువులాగా నీ ఆత్మే నీకు శత్రువై నీమీద పగ సాధిస్తుంది. ఒక శత్రువు చేసే పనేమిటి. అపకారం. ద్రోహం. అంతకన్నా ఏముంది శత్రుత్వం. అది దూరంగా ఎవరో గాదు. నీ ఆత్మే నీకు చేయగల దలాటి ద్రోహం. ఏమిటది ఎలాగా. మోక్ష మార్గానికి నీవు ప్రయత్నిస్తుంటే అడుగడుగునా అడ్డు తగులుతుంటుంది. మనసూ ఇంద్రియాలూ నిన్ను పక్కకు లాగుతుంటాయి. వాయుర్నావ మివాంభసి అని ఇంతకు ముందే సెలవిచ్చాడు గదా మహర్షి తుఫాను గాలి పడవను నీటిలో ముంచివేసి నట్టు ముంచివేస్తుంది నిన్నీ ప్రాపంచిక వ్యవహారాలలో. అదే అవి నీమీద సాధించే శత్రుత్వం.
కాబట్టి బాహ్యంగా ఎక్కడో లేరు శత్రువులూ మిత్రులూ. విచారిస్తే నీకు నీవే శత్రువు. నీకు నీవే మిత్రుడు. అదుపు తప్పితే నీ దగ్గర ఉన్న నీ మనస్సూ ఇంద్రియాలే నీ మార్గాని కవరోధం కల్పించే శత్రు వర్గం. అదుపులో ఉంచుకొంటే అవే నీకు సాధన మార్గంలో చేయూత నిచ్చి తోడ్పడే మిత్రవర్గం.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః || 7 ||
అంచేత వారెవరో శత్రువులున్నారు నా దారికడ్డు తగులుతున్నారు. వీరందరూ నాబంధవులు నాక్షేమం కోరి నాకు సర్వవిధాలా సహాయ
Page 462