#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఒకవేళ వారు నీకు బోధించినా అది అందుకో వలసినది నీ మనస్సే. అందుకొన్న తరువాత అమలుపరచి దాన్ని స్వానుభవానికి తెచ్చుకో వలసిందీ చివరకు నీ మనస్సే. అంచేత ఎవణ్ణి వాడే ఉద్దరించుకోవాలనే మాట ఎంతైనా విలువైన మాట. కాకున్నా నీకన్నా నీకు సన్నిహితు డెవడున్నాడు. మిగతా వారెవరైనా నీకాత్మీయులైతే కావచ్చు కాని ఆత్మ కాలేరు. నావాళ్లంటావే గాని నేననలేవు గదా ఎవరినీ కూడా. కాబట్టి వాస్తవంలో నీకంటే బంధువులూ లేరు. నీకంటే నీకు శత్రువులూ లేరు. నీకు నీవే బంధువు. నీకు నీవే శత్రువని తెలుసుకో. ఆత్మైవహ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః అంటున్నాడు మహర్షి. బంధువని నీవు అభిమానించేవాడు కూడా ఆ మాటకు వస్తే నీకు ప్రతికూలమే. బంధురపి తావన్మోక్షం ప్రతి ప్రతికూల ఏవ. స్నేహాది బంధనాయత నత్వాత్. బంధువనే వాడు మోక్షమార్గంలో ఎప్పుడూ నీకు అడ్డు తగిలే వాడే. ఎందుకంటే వాడిమీద నీవు స్నేహబంధ మెప్పుడూ తెంచుకోలేవు. ఇక వాడు నీ సాధనకెలా సహకరించగలడు. మీదు మిక్కిలి నిన్ను మార్గంలో ముందుకు పోకుండా వెనక్కు లాగటానికే చూస్తుంటాడు.

  అలాగే ఆత్మైవ రిపు రాత్మనః - నీ ఆత్మే నీకు శత్రువు. బాహ్యంగా నీకు శత్రువు లెవరో లేరు. ఎక్కడో లేరు. ఎక్కడైనా ఉన్నట్టు నీకు కనిపించినా సోపి ఆత్మ ప్రయుక్త ఏవ అంటున్నారు భగవత్పాదులు. నీవల్లనే వాడలా తయారయ్యా డంటారాయన. నిజమే సర్వులనూ ఆత్మస్వరూపంగా

Page 460

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు