#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఇస్తున్నాడు. అలా సంకల్పాలన్నీ నిస్సంకల్పం చేసుకొని మనసు నిర్మలంగా పెట్టుకొన్నప్పుడే యోగారూఢ స్తదోచ్యతే - యోగారూఢు డనిపించు కొంటాడు సాధకుడు. లేకుంటే ఆరురుక్షువూ కాడు. ఆరూఢుడూ కాడు. ఉభయభ్రష్టుడయి పోతాడు.

ఉద్ధరేదాత్మనాఽఽత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || 5 ||

  కాబట్టి అనులోమంగా చేయాలి ప్రయాణమెప్పుడూ సాధకుడైనవాడు. ప్రతిలోమంగా కాదు. ప్రతిలోమంగా చేస్తే అనుకొన్న గమ్యం చేరలేడు. గమ్యమనేది జీవితాని కెప్పుడూ మోక్షమే. అది ఏదో గాదు. బ్రహ్మభావమే. అది అందుకోవాలంటే దానివైపే చేయాలి ప్రయాణం. అది జ్ఞానం. దాని కడ్డు పడేవి తొలగించుకొంటేనే అది మనకు లభిస్తుంది. జ్ఞానోత్పత్తి కలా అడ్డు తగిలేవి ఆవరణ విక్షేపాలే. వాటిని తొలగించుకోటానికి సాధనాలే ప్రస్తుత మీ కర్మధ్యాన యోగాలు. తొలగించు కోటం ప్రతిలోమమైనా అది అనులోమమైన జ్ఞానానికి తోడ్పడే సామగ్రే గనుక సాధనమే అది. ఏ సాధనమైనా పట్టుకోవలసింది మానవుడి మనస్సే. అది శుద్ధి అయితే ఆవరణ నాశ మవుతుంది. ఏకాగ్రమైతే విక్షేప నాశ మవుతుంది. అప్పుడు ప్రయాణం నిరాఘాటంగా సాగిపోతుంది.

  దాని విషయమే ప్రస్తుతం వర్ణించి చెబుతున్నది భగవద్గీత. ఉద్ధరేదాత్మనాత్మానం. నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవలసి ఉంటుంది.

Page 458

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు