#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఏమాత్రమూ పడిపోగూడదు. పడ్డా వెంటనే తప్పించుకొని బయటపడాలి. అది ఎప్పుడు సాధ్యమంటే చెబుతున్నాడొక ఉపాయం వ్యాసభగవానుడు. సర్వ సంకల్ప సన్న్యాసీ. మనసులో ఎప్పుడే సంకల్పం కలిగినా సరే. అన్ని సంకల్పాలనూ ఎప్పటికప్పుడు కూకటి వేళ్లతో పెరికి పారేయాలి. సర్వాన్ అనే మాటకు ఇహాముత్రార్ధ కామహేతూన్ అని వివరణ ఇచ్చారు స్వామివారు. ఒక ఐహికమే గాదు. ఆముష్మికమైన స్వర్గభోగాల మీద కూడా ఉండగూడదు కామం. కామానికి మూలం సంకల్పం. కామ జానామితే మూలం సంకల్పాత్కిల జాయసే. కామాలన్నీ ఆయా పదార్ధాలను సంకల్పించి నప్పుడే కలుగుతుంటాయి. ఇహం నుంచి పరందాకా ఉంది వాటి క్షేత్రం. అంచేత దృష్టమైన ఐహికమను. అదృష్టమైన ఆముష్మికమను. ఏదైనా కామమే. దానికి నిమిత్తం మానవుడి సంకల్పమే.

  అంచేత సంకల్పం చేయకుంటే కామం లేదు. కామం లేకుంటే కర్మ లేదు. సయధా కామో భవతి తత్రతు ర్భవతి - యత్రతు ర్భవతి తత్కర్మ కురుతే - యత్కర్మకురుతే - తత్ఫల మభిసంధత్తే అన్నారు. ఏది చేయాలని కోరితే అది చేస్తాడు. ఏది చేస్తే దాని ఫలమను భవించక తప్పదు మానవుడు. చేయాలనే కోరిక ఎప్పుడేర్పడుతుంది. దానికి ముందు తద్విషయమైన సంకల్పం లేదా అభిప్రాయ Intention మేర్పడితే. కనుకనే సర్వసంకల్ప సన్న్యాసీ - అన్ని సంకల్పాలూ అనర్ధహేతువులే కాబట్టి మంచీ చెడ్డా అని చూడకుండా అవి ఉదయిస్తున్నప్పుడే త్రోసిపారేయాలని సలహా

Page 457

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు