#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

సమాధానం వేదవ్యాసుడు. యదాహి నేంద్రియా ర్దేషు న కర్మ స్వనుషజ్యతే. ఇంద్రియార్ధాలని ఒక అయిదున్నాయి. అవే శబ్ద స్పర్శ రూపరసగంధాలు. పంచభూతాల దూతలివి. ఇవి వచ్చి మన పంచేంద్రియాలను పట్టుకొంటాయి. వాటినీ ఇంద్రియాలు పట్టుకొంటాయి. వీటిలావా దేవీ ఇలా సాగుతున్నంత వరకూ ఉపశమనం లేదు సాధకుడికి. ఈ గందర గోళంలో ఏదీ సాధించ లేడు మానవుడు. వలలో తగులుకొన్న పక్షిలాగా వాటి పాశంలో పడిపోతాడు.

  అంతేకాదు. అవి ఎప్పుడు వీణ్ణి ప్రపంచంవైపు లాగేస్తున్నాయో అప్పుడు శాస్త్రోక్తమైనవీ లౌకికీమైనవీ అన్ని కర్మలూ నెత్తిన పెట్టుకొంటాడు. అది మరలా ఒక పాశం వాడి పాలిటికి. శబ్ద స్పర్శాదులలో పడి అక్కడి నుంచి వాటి ననుభవించాలనే అభిలాషతో ఆయా కర్మలన్నీ చేయలేక సతమత మవుతుంటాడు. అది అక్కడి కాగక ఫలానుభవం వరకూ వీణ్ణి ఈడ్చుకొని పోతుంది. కర్మ చేస్తే దానికి ఫలితముండాలి గదా. ఫలితమేర్పడితే అది మంచో చెడో అనుభవించక తప్పదు గదా.

  అంచేత ఇంద్రియార్ధాలలో వాటి కోసం పెట్టుకొనే కర్మలలో ఇంత మహోపద్రవం పొంచి ఉందని అది తన సాధన మార్గాని కెప్పుడూ ప్రతిబంధకమే నని ముందుగా పసిగట్టి జాగ్రత్త పడాలి సాధకుడు. ఏమిటా జాగరూకత. అటు ఇంద్రియార్థాలైన శబ్దాదులలోనూ - తన్నిమిత్తంగా పెట్టుకొనే ఆయా నిత్యనైమిత్తిక కామ్యాది కర్మలలోనూ నానుషజ్జతే

Page 456

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు