కర్మసన్యాస యోగము
భగవద్గీత
నేతేడా. అంతా సమమైన ఆత్మగానే దర్శించేవాడి కలాంటి విభేదమెలా ఏర్పడుతుంది. ఇప్పుడిలాంటి దైవగుణ సంపన్నులూ ఆత్మ జ్ఞాన సమన్వితులూ లేరంటారా లోకంలో. మనుష్యాణాం సహస్రేషుఅని నూటికి కోటికొక్కరైనా ఉండకపోరు. చాలా అరుదైతే కావచ్చుగాని అసలే లేరని కొట్టివేయరాదు. అలాంటి మహనీయుణ్ణి గుర్తు పట్టే తాకతు నీకూ నాకూ లేకపోవచ్చు . అంతేకాని వాడే లేడనరాదు. ఉంటాడెవడో ఒకడు. వాణ్ణి గుర్తించే వాడూ ఉంటాడెవడో ఒకడు. గుర్తించాలంటే ఎలా గుర్తించాలో చెప్పింది మనకు శాస్త్రం. ఇలాంటి లక్షణా లెవరిలో నీకు కనపడతాయో వాడు బ్రహ్మ వేత్త జీవన్ముక్తుడని అర్ధంచేసుకోమని. వాడివాడి లక్షణాలను బట్టే అర్థం చేసుకోవలసి ఉంటుందెవడి నైనా. అవే మనకు పట్టి ఇస్తాయి వాడి స్వరూప మెలాంటిదో వాడున్న స్థితి ఎలాంటిదో.
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ || 26 ||
అసలెందుకు వచ్చిందీ సందేహం నీకు. లోక దృష్టితో చూస్తే అన్నీ సందేహాలే . జ్ఞాన దృష్టికే సంశయమూ లేదు రజ్జు దృష్టికి రజ్జువే కనిపిస్తుంది. అదే సర్ప దృష్టితో చూస్తే సర్పమే కనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్య మేముంది. పదార్థమొకటే. అదే తెలిసిన వాడి దృష్టి కొకవిధంగా తెలియని వాడి దృష్టికి మరొక విధంగా గోచరిస్తుంది. బ్రహ్మ తత్త్వం
Page 434