కర్మసన్యాస యోగము
భగవద్గీత
మాట. ఆరామ మంటే క్రీడ అనే కాదు. విశ్రాంతి అని కూడా అర్థమే. ఆత్మలోనే విశ్రమిస్తుంటాడని చెప్పినా చెప్పవచ్చు. ఉన్నదంతా ఆత్మే అయినప్పుడెక్కడ విశ్రమించాలి వాడాత్మలోగాక.
తధా అంత ర్జ్యోతి రేవయః - అంతేగాక అంతరాత్మే వాడికి జ్యోతి. చైతన్య ప్రకాశమే ప్రకాశం. సౌరప్రకాశం కాదు. చంద్ర ప్రకాశం కాదు. అగ్నిప్రకాశం కాదు. తమేవ భాంత మనుభాతి సర్వం.
ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంటేనే దాని ననుసరించి ఇవి కూడా ప్రకాశిస్తాయి. సూర్య చంద్రాదుల చేతన పదార్ధాలు. అచేతనానికి స్వతహాగా లేదు ప్రకాశం. చైతన్యం సప్లై చేస్తేనే. చైతన్య మలా కాదు. స్వయంగానే ఉంటుంది దానికి ప్రకాశం. ప్రకాశమేమిటి. ఉన్నాననే ప్రజ్ఞా స్ఫురణే ప్రకాశమంటే. మొదట నేనున్నాననే స్ఫురణే ఉంది నాకు సహజంగా. ఆతరువాత నాకు కనిపించే సమస్తమూ ఉందని చూస్తున్నాను. ఇందులో నేనున్నాననే స్ఫురణ సహజమైన స్ఫురణ . దాని వెలుగులో చూస్తే కనిపిస్తున్నది కాబట్టి ఈ ప్రపంచానికది సహజం కాదు. కృత్రిమం.
అలాంటి కృత్రిమ ప్రపంచం వల్ల కలిగే సుఖమే సుఖమని నీవు భావించినప్పుడు సహజమైన ఆత్మ సుఖమను భవించే వాడెలా భావిస్తాడో చెప్పు. కృత్రిమం కాబట్టి ఇది ఇంకా తాత్కాలికం. సహజం కాబట్టి అది శాశ్వతం. చైతన్య మెప్పుడూ ఉంటుంది కాబట్టి దాని ప్రకాశమూ ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల కలిగే సుఖమూ విశ్రాంతీ ఎప్పుడూ ఎడతెగకుండా అనుభవానికి వస్తూనే ఉంటాయి జ్ఞానికి.
Page 431