#


Index

విషాద యోగము భగవద్గీత

తత్త్వమసి అంటే ఏమని అర్ధం. త్వమ్మంటే నీవు - తత్తంటే అది. అసి అంటే అయి ఉన్నావని శబ్దార్థం. నీవదేనంటే ఎవడీ నీవు. ఎవడా అది నీవు ఇప్పుడీ శరీరం మేరకే ఉండి సంసార కష్టాలను భవించే జీవుడు. అది అంటే ఇలాంటి శరీరాలు కోటానకోట్లు వ్యాపించి సర్వత్ర ఆకాశంలాగా పరచుకొని ఉన్న చిదాకాశం. పరమాత్మ. పోతే అసి ఏమిటి. ఈ జీవాత్మ ఎవరో కాదు వాస్తవంలో ఆ పరమాత్మే సుమా. అదే ఈ వేషంలో కనిపిస్తున్నదని రెంటికీ ఏకత్వాన్ని చెప్పటం. శాస్త్రం చెబితే అవి ఏకమా అంతకు ముందే ఏకమా. ముందునుంచీ అవి ఏకమే. రెండు గావు. ఒకే ఒక తత్త్వం. అయినా అనాది కాల ప్రవృత్తమైన అజ్ఞానం మూలంగా ఆత్మానాత్మలనే Sub-Obj విభాగ మేర్పడింది. వాస్తవం కాదది. ఆభాస. అజ్ఞాన మనేది ఉన్నంత వరకూ ఆ భాసే మనపాలిటికి వస్తువై వస్తురూపమైన ఏకాత్మ భావ మా భాస అయిపోయింది.

  కనుక ఇప్పుడీ నామరూపాలనే ఉపాధి నుంచి ఇందులో కలిసిపోయి వాటితో తాదాత్మ్యం చెందిన ఆత్మ చైతన్యాన్ని వేరు చేసి చూడాలి మనం. ఆ తరువాత ఆ ఆత్మ దృష్టితో అనాత్మగా భాసించే ఈ ఉపాధి వర్గాన్ని అంతటినీ చూచి దీన్ని కూడా ఆత్మలోనే ప్రవిలయం చేసుకొని అంతా ఏకాత్మగా దర్శించగలగాలి. ఇందులో వేరు చేయటం

Page 43

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు