#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


బలహీనత. కనుక వాటి ధాటి నెదిరించి నిలబడేది ఆత్మబలమే. ఆత్మబల మెప్పుడూ ఉంది. కాని దాన్ని గుర్తించేవరకూ పనిచేయదది. కాబట్టి ఆత్మ ఉందనుకొని సుఖంలేదు. దాని తాలూకు జ్ఞానం కావాలి మనకు. ఆత్మ జ్ఞాన బలమే ఆత్మ బలం. అదే జవాబు చెబుతుంది కామక్రోధ బలానికి. చెబితే ఇక అంతా సుఖమే. సయుక్తః ససుఖీనరః - అలాంటి మహాజ్ఞాని కెప్పుడూ సుఖమే. అది ఎప్పుడూ ఎడ బాయ కుండానే ఉంటుందాత్మ జ్ఞానం. యుక్త అంటే అదే అర్థం. ఎప్పుడది నిత్యసిద్ధమో ఆ జ్ఞానం దానివల్ల కలిగే సుఖం కూడా నిత్యసిద్ధమే. యుక్తుడూ వాడే సుఖీవాడే. జ్ఞానికే సుఖం మరెవరికీ గాదు.

యోఽంతఃసుఖోఽంతరారామస్తథాంతర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి || 24 ||

  అనాత్మ ప్రపంచం వల్ల లేకుంటే జ్ఞాని కీలాంటి సుఖ మొక్కడి నుంచి లభిస్తుంది. ఎలా లభిస్తుంది. మరెక్కడినుంచీ వచ్చే అవకాశమే లేదు గదా. నిజమే పామరుడి దృష్టి క లాగే అనిపిస్తుంది. అనాత్మ తప్ప పామరుడి కాత్మ అనే దొకటి ఉందనే తెలియదు. కనపడేదే ఉంటుంది గాని కనపడని దెలా ఉంటుందని వాడి ఆలోచన. కాని కనపడే దాని కాధారం కనపడని ఆత్మేనని వాడికర్థం కాదు. కనేది లేకుండా కనపడే దుంటుందా. ఉండకనే పోతే కనిపిస్తుందా. కనేది ఎప్పుడూ జ్ఞానమే. జ్ఞాన ప్రకాశంలోనే కనిపిస్తున్నదీ మొత్తం ప్రపంచం మనకు. లేకుంటే అంధకార బంధురం. ఏదిగానీ ఉందని చెప్పలేము. ఏదుందని చెప్పినా దాని కొక ప్రమాణ ముండాలి. ప్రమాణాన్ని బట్టే ప్రమేయాని కస్తిత్వం. ప్రమాణ

Page 429

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు