కర్మసన్యాస యోగము
భగవద్గీత
లోలోపల పురుగులయి తొలుస్తుంటాయి. తరువాత అవి బహిర్గత మయ్యాయో ఇక వాటి వేగమింతా అంతా కాదు. శరీరం గగుర్పొడుస్తుంది. కండ్లు విప్పారు తాయి. ముఖం వికసిస్తుంది. మనసు చలిస్తుంటుంది. ఇది కామం వల్ల కలిగే వేగం. పోతే క్రోధమింత కన్నా దారుణం. శరీరం కంపించి పోతుంటుంది. చెమట పడుతుంది. కళ్లు ఎర్ర పడుతాయి. పెదవులు గట్టిగా కరవటమూ పండ్లు కొరకటమూ ఒకటేమిటి. ఎంతో ఉంది క్రోధానికి వేగం.
ఇలాంటి కామక్రోధో ద్భవం వేగం - కామ క్రోధాల ఆర్భాటాన్ని
శక్నో తీహైవ యస్సోఢుమ్ మనసు హద్దులు దాటి బయట పడక
ముందే హుషారు పడి మనసులోనే వాటిని త్రుంచి పారేయాలి. మొక్కలోనే
తుంచాలిగాని మానుగట్టిన తరువాత ఏమీ చేయలేము. ఇహైవ. అది
కూడా బ్రతికుండగానే సాధించాలి మానవుడు. అది ప్రతి మానవుడికీ
కర్తవ్యం కామ క్రోధ వేగాన్ని సహనంతో జయించటమే అది. అయితే
ఒకటి త్రోసివేయాలంటే మరొకటి పట్టుకొనే త్రోసి వేయగలం. అలాగే
ఇక్కడ కూడా రాగద్వేషాల ప్రభావాన్ని అణగ దొక్కమని సలహా ఇచ్చారు
బాగానే ఉంది. అది ఏ బలంతో చేయాలాపని. ఆత్మ బలమే బలం.
బలమెక్కడి నుంచీ కొని తెచ్చుకొనేది కాదు. కారణ మేమంటే ఎక్కడి నుంచి
తెచ్చుకొన్నా అది అనాత్మ ప్రపంచంలో నుంచే గదా తెచ్చుకోవలసింది.
ఆనాత్మ ప్రపంచమంతా కామక్రోధాదులకు నిలయమే అయికూచుంది.
అలాంటప్పుడది మనకు ఇచ్చే బలమేమి బలం. బలం కాదది ఇచ్చేది
Page 428