#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


వ్యాపించి ఉన్నదాన్ని గాక దాన్నే విషమమైన చరాచర పదార్థాలుగా చూస్తున్నాము. కనుక అక్కడే ఉన్నా సమం మరుగుపడి పోయి అదే విషమంగా దర్శన మిస్తున్నది. అంటే సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యమే ఆయా వ్యక్తులుగా ఆయా రూపాలుగా భాసిస్తున్నది.

  కాగా ఆత్మ జ్ఞాన మున్న పండితుడలా చూడడు. వాడీ విషమమైన సృష్టిలోనే సమాన్ని స్పష్టంగా చూడగలడు. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే. విద్యా వినయ సంపత్తి ఉన్న ఒక సద్ర్భాహ్మణుడిలో ఏది చూస్తాడో అదే గవి ఒక గోవులో చూస్తాడు. హస్తిని - ఒక ఏనుగు శరీరంలో చూస్తాడు. అంతేకాదు. శుని ఒక కుక్కలో చూస్తాడు. శ్వపాకేచ ఆ కుక్క మాంసం వండుకొని తినే చండాలుడిలో కూడా అదే చూస్తాడు. అదే అంటే ఆసమాన్నే. సమమంటే ఏమిటి. సమంగా పరుచుకొన్న ఆత్మ తత్త్వాన్ని, సత్తాస్ఫూర్తు లుగా సర్వత్రా వ్యాప్తమయి ఉందది. సర్వత్ర అంటే ఎక్కడని. చెప్పాడుగా బ్రాహ్మణుడు - గోవూ - గజమూ - శ్వానమూ - శ్వపాకుడని. ఇవన్నీ వేర్వేరు శరీరాలు. వేర్వేరు వ్యక్తులూ - భావాలూ - చేష్టలూ - ఎంతో విషమమైన పదార్థాలు. అవి ఎంత విషమమైనా విషమం కాని దొకటి వాటిలోనే చోటు చేసుకొని ఉంది. అదే ఉండటమనే స్ఫూర్తి. ఇవి స్ఫురించే పదార్థాలైతే అది కేవలం వీటిలో ఉన్న స్ఫురణ అది మాత్రమే పట్టుకొన్న వాడికి తేడా రాదు. అన్నీ సమానమే అవుతాయి. అయినా అవి కూడా ఉన్నాయిగదా అని అడగవచ్చు. సత్తా స్ఫూర్తులు లాగి వేస్తే అవి కేవలమా భాస అయి పోతాయి. వాస్తవంగా కనిపించవు. బంగారం లాగేస్తే నగల రూపాలూ వాటి వైవిధ్యమూ కనిపిస్తుందా నీకు. లాగేయట మంటే ఇక్కడ

Page 418

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు