కర్మసన్యాస యోగము
భగవద్గీత
మవలంబించి చిత్త శుద్ధి గడించి తరువాత ఆత్మజ్ఞాన మార్జించి అనాత్మగా చూస్తూ వచ్చిన కర్మ కలాపమంతా ఆ జ్ఞానంలో సన్న్యసించి అంతా ఏకంగా ఒకే ఒక ఆత్మ స్వరూపంగా చూడగలిగితే కర్మయోగి జ్ఞానయోగి కాక ఏమవుతాడు.
కాబట్టి మొదటి నుంచీ మోక్ష మార్గంలో శిక్షణ పొందుతూ రావాలి సాధకుడు. అందులో మొదటి మజిలీ తద్బుద్ధయః - దాని మీదనే బుద్ధి పెట్టుకొని బతకాలి. దానిమీదనంటే సర్వవ్యాపకమైన ఆత్మ తత్త్వం మీద. తదాకారమైన వృత్తి ఏర్పడ The Thought of the uni-versal self. అది ఏర్పడిం దనుకోండి. ఏర్పడ్డా అది నాకు దూరంగా పరోక్షంగా ఉదయించి ప్రయోజనం లేదు. పరోక్షంగా భావించే తత్త్వాన్ని అపరోక్షంగా తన స్వరూపంగా దర్శించాలి. తదాత్మానః అంటే అదీ అర్ధం. అదే తానయిపోవాలి. లేకుంటే అది తన కనాత్మ అవుతుందే object గాని ఆత్మ Subject గా అనుభవానికి రాదు. అనుభవ స్వరూప మాత్మ.
పోతే అనుభవానికి వచ్చినా సరిపోదు. ఎప్పుడూ ఎడతెగకుండా ఉండాలా అనుభవం. లేకుంటే మెరుపు మెరిసినట్టు కలిగి తొలగిపోయే ప్రమాదముంది. తొలగితే మరలా గాఢాంధకారమే. అనాత్మ ప్రపంచమే మన పాలిటికి అంధకారం. ఆత్మ ప్రకాశమెప్పుడూ నిలిచి ఉంటేనే అది తొలగిపోయేది. లేకుంటే దాడి చేస్తుంది మనమీద. అంచేత తన్నిష్ఠాః అంటున్నది గీత. ఆ ప్రకాశమలాగే నిలుపుకోవాలి సాధకుడు. దీనికే నిదిధ్యాసన అని పేరు. తద్బుద్ధి అనేది శ్రవణ మనుకొంటే తదాత్మత్వం మనన మనుకొంటే తన్నిష్ఠా అనేది ధ్యానమనుకోవచ్చు. విజాతీయ భావం
Page 414