కర్మసన్యాస యోగము
భగవద్గీత
రూప ప్రపంచాన్నీ తన వెలుగులో ప్రకాశింపజేస్తాడో అలాగే ఈ అఖండ జ్ఞానం కూడా ఆ పరమాత్మ తత్త్వాన్ని మరలా ఉన్నదున్నట్టు మనకు ప్రత్యక్షంగా బయటపెట్టి చూపుతుంది. జీవాత్మ తానే పరమాత్మననే సత్యాన్ని స్వానుభవానికి తెచ్చుకొంటాడని భావం.
అలా తెచ్చుకొన్నప్పు డిక జీవుడూ లేడు. ఈశ్వరుడూ లేడు. రెండింటికీ బదులున్న దొకే ఒక ఆత్మ చైతన్యం. అది అఖండం గనుక అందులో జీవచైతన్య మీశ్వర చైతన్యమనే ద్వైతాని కాస్కారం లేదు. అలాంటప్పుడిక జీవుడేమిటి. కర్మ ఏమిటి. అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయటమేమిటి. అంతా హుళక్కే. అలాంటప్పుడు నకర్తృత్వం న కర్మాణి అని జీవుడెగిరి పోయాడు. నా దత్తే కస్యచి త్పాపమని ఈశ్వరుడెగిరి పోయాడు. జీవేశ్వరు లనేవి రెండూ సాపేక్ష Relative మైన భావాలు. ఒకదాన్ని బట్టి ఒకటి. ఇదుంటే అది. అదుంటే ఇది. అంతా ఆత్మ స్వరూపమనే పరిపూర్ణ జ్ఞానం లేనందువల్లనే తయారయిందీ భేద భావం. అలాటి జ్ఞానమెప్పుడు దయించిందో నిరపేక్షమైన Absolute ఆ వెలుగులో సాపేక్షమైన ఈ భావాలు రెండూ లయం కాక తప్పదు.
తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః || 17 ||
అయితే ఒక్కమాట. యేషాంతేషా మని ఒక షరతు విధించింది గీత. ఎవరైతే అలా జ్ఞాన మార్జించి జ్ఞాను లనిపించు కొన్నారో వారికే ఆభాగ్యం. ఎవరంటే వారికి గాదు. కాదని శాపం పెట్టటం లేదు మేము మరలా. తగిన శిక్షణ పొంది మోక్షమార్గంలో పయనించే సాధకుల కెప్పటికైనా అది లభించటం ఖాయం. కొంతకాలం కర్మ యోగ
Page 413