#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


స్వీకరించటం లేదు. ఉంటే గదా స్వీకరించటానికి. అప్పటికి రెండూ కరెక్టే. అజ్ఞాన దృష్టిలో అది కరెక్టే - జ్ఞానదృష్టిలో ఇదీ కరెక్టే. ఏమిటా కరెక్టు - నీవప్ప జెప్పటమూ. అప్పగించినా వాడంగీకరించక పోవటమూ. ఇదీ పరిష్కారం.

  ఇందులో అజ్ఞాన దృష్టితో చేసిన పరిష్కారమేదో అది ముందు శ్లోకంలో చెప్పి ఇప్పుడీ శ్లోకంలో జ్ఞానదృష్టితో చేయబోయే పరిష్కారమేదో వర్ణిస్తున్నాడు మహర్షి. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః - అజ్ఞానానికి జ్ఞానమే విరుగుడు. జ్ఞానమనే దొక వెలుగు. వెలుగు వస్తే చీకటి విరిసి పోయినట్టే జ్ఞానోదయమైతే అజ్ఞానమిక బలాదూరు కాక తప్పదు. అది నాశితం. పూర్తిగా నష్టమయి పోతుంది. ఆత్మనః - ఆత్మకసలు అజ్ఞానమే లేదు. ఆత్మ అంటే అది జ్ఞాన స్వరూపం. మరి ఎక్కడిదీ అజ్ఞానం. జ్ఞానమనేది ఉదయించక అదే నీకు అజ్ఞానంగా అనుభవానికి వస్తున్నది. అంటే సామాన్య జ్ఞానమే నీవీ శరీరాద్యుపాధుల మేరకు చూచేసరికి విశేషజ్ఞాన రూపంగా భాసిస్తున్నది. అదే అజ్ఞానమని పేర్కొనటం మేము.

  అది ఇప్పుడు నేను పాధిరహితమైన చైతన్యమాత్రుడను గదా అని ఎప్పుడీ సాధకుడు గుర్తించాడో - అప్పుడు చీకటి లాగా విరిసిపోయింది. విశేషరూపంగా కనిపించిన జ్ఞానం సర్వవ్యాపకమైన సామాన్యజ్ఞానంగా సాక్షాత్కరిస్తుందని అర్ధం. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం. ఎలా సాక్షాత్కరి స్తుందది. ఒక ఆదిత్య మండలం లాగా పైకి వచ్చి కనిపిస్తుంది. అలా పైకి వచ్చిందంటే చాలు. ప్రకాశయతి తత్పరం - ఆదిత్యుడెలాగా సమస్త

Page 412

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు