#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


లేకున్నా ఉన్నదనీ భ్రాంతి పడుతున్నాడు. అందుకే అది కేవలం నీ భ్రాంతే గాని అసలు వాస్తవంగా లేవని మరలాచాట వలసి వచ్చింది గీత. ఏమని నకర్తృత్వం - నకర్మాణి నా దత్తే కస్య చిత్పాపం నచైవ సుకృతమని.

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః |
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ || 16 ||

  అయితే ఇప్పుడొక ప్రశ్న. చేసే ప్రతి కర్మా ఈశ్వరుడి కప్పజెప్పి ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూ పొమ్మని మీరేగదా సలహా ఇచ్చారు కర్మయోగంలో. మరి ఇప్పుడేమిటి ఇలా మాటాడుతారు. ఈశ్వరుడేదీ పట్టించుకోడు. నీవు మంచి చేశావో చెడ్డ చేశావో ఆయన ఏదీ దగ్గరికి తీసుకో డంటా రేమిటి. ఆయన ఏదీ తీసుకోకపోతే ఆయన మీద పారేయట మనే మాట కర్ధ మేముంది. మనమూ కాదని త్రోసిపుచ్చి ఆయనా తనకక్కర లేదని త్రోసేస్తే మరి కర్మయోగి చేసే కర్మ లేమయి పోతాయి. ఎక్కడికి పోతాయని ఆ శంక.

  దీనికి జవాబింతకు ముందిచ్చాడు. ఇప్పుడివ్వ బోతున్నాడు. అజ్ఞానేనా వృతం జ్ఞానమనే దింతకు ముందుగా ఇచ్చిన సమాధానం. అజ్ఞానం వదలక నీవను కొంటున్నావు నీకు భిన్నంగా ఒక ఈశ్వరు డున్నాడని. నీవున్నాడని ఊహించిన ఆ ఈశ్వరుడి కప్ప చెబుతున్నావు నీవు చేసే కర్మలూ వాటి ఫలమూ. అక్కడ ఒక ఈశ్వరుడు వస్తుతః నీకు వేరుగా ఉన్నాడని కాదు. నీ ఊహలో ఉన్నాడు వాడు. కాబట్టి అప్పజెబు తున్నాననే ఊహతోనే వాడి కప్పగిస్తున్నావవి. ఊహలోనే గాని వస్తుసిద్ధంగా వాడు నీకు వేరుగా లేడు. కాబట్టి నాదత్తే కస్యచి త్పాపం. వాడెవరి పుణ్యపాపాలూ

Page 411

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు