కర్మసన్యాస యోగము
భగవద్గీత
మరి ఇలా జీవుడనే వాడే లేడన్నప్పుడు వీడు పుణ్యాత్ముడు మహాభక్తుడు వీడీశ్వరుడికి - వీడు పాపాత్ముడు ఈశ్వర ద్వేషి అని జీవులలో తేడా చూడటం ఎంత తెలివి తక్కువ. నీవొక వేళ అజ్ఞాన వశాత్తూ తేడా చూచినా అలా మాటాడినా ఉన్నదొకే ఒక ఈశ్వర చైతన్యం. దాని కేలాటి అజ్ఞానమూ లేదు గదా. దానికీ పుణ్యపాప విచారమెలా ఉండగలదు. కనుకనే నా దత్తే కస్యచి త్పాపం. ఎవరి పాపన్నీ అది దగ్గర చేర్చుకోదు. నచైవ సుకృతం విభుః - ఎంత విభువైనా అది ఎవరి సుకృతాన్నీ నెత్తిన పెట్టుకోదు. తనకా పుణ్యపాపాలు స్వయంగా లేవు. అది శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. మరొకడి పుణ్యపాపాలా అవి తనకు విలక్షణంగా ఎప్పుడూ చూడదది. వస్తుసిద్ధంగా ఏ ద్వంద్వాలూ లేవు దానికి. నిర్ద్వంద్వంగా ఉన్న వస్తువు తానే.
అలాంటప్పుడీ పుణ్యపాపాది ద్వంద్వా లెక్కడివి. వాడికి స్వతహాగా లేక వేరొకడు వాడికి భిన్నంగా ఎవడూ లేకపోతే ఇవి ఎలా ఏర్పడ్డట్టు. ఎవరు వీటికాశ్రయ మిచ్చి నట్టు. ఎవరో గాదు. జంతవః - మానవులే. పశువులూ మృగాలే గదా జంతువులు. కాదు. జన్మించిన ప్రతి ప్రాణీ జంతువే. మానవుడు కూడా పశుపక్ష్యాదుల లాగా జన్మించినవాడే గదా అంచేతనే ద్విపాజ్జంతువులు మానవులు. మిగతా పశుపక్ష్యాదులలాగా వీరూ జన్మ ఎత్తినా వీరి కొక విశేషముంది. అది జ్ఞానం. కాని ఆ జ్ఞానం విశేష జ్ఞానమేగాని సామాన్య జ్ఞానం కాదు. ఎక్కడి కక్కడ వేరుచేసి ఇది ఫలానా అది ఫలానా అని చూడటం విశేష జ్ఞానం. అలాగే చూస్తు న్నారు మానవులందరూ. ఇది భార్య - ఇది బిడ్డలూ - ఇది ఇల్లూ - ఇది
Page 409