కర్మసన్యాస యోగము
భగవద్గీత
కూడా కర్మ ఎక్కడికీ పోదు. మహా అయితే దాన్ని జ్ఞాన విభూతిగా దర్శించమని శాస్త్రం చెబుతుంటే అసలింకా జ్ఞానమే కలగకుండా కర్మ మానేద్దా మనుకొంటే చెల్లుతుందా. అది నేల విడిచిన సాము. ఇటుకర్మకూ అటు జ్ఞానానికీ నోచుకోక దెబ్బ తింటావని హెచ్చరిస్తున్నా డిప్పుడు భగవానుడు.
కర్మ కోసమని గాదు కర్మ. జ్ఞానం కోసమని సాగించు. ఎలా సాగించాలి దాని విధాన మేమిటని అడుగుతావా. బ్రహ్మణ్యాధాయ కర్మాణి . బ్రహ్మానికే అర్పించు నీవు చేసే కర్మలన్నీ. బ్రహ్మమంటే సచ్చిద్రూపం. రూపంగాని రూపమది. అంచేత సర్వవ్యాపకం. పరిపూర్ణం. ఎటు వచ్చీ అలా పరిపూర్ణం కాని వాడవు నీవే. నీవు చేసే కర్మ అంతకన్నా పరిపూర్ణం కాదు. పరిమితమైన జ్ఞానంతో నీవే కర్మ చేసినా అది పరిమితమే. అందుకే నేను చేస్తున్నానని నీవు నీవనుకొన్నట్టు గానే అదీ - తయారవుతుంటాయి. ఆ నేను చేస్తున్నా ననుకోటమే కర్తృత్వ బుద్ధి. అది నిన్ను నీ ఉపాధి మేరకే తగ్గించి బ్రహ్మానికి దూరం చేసింది. ఆ భావంతో తగ్గిపోయి నీవు చేసేది నీకన్నా తగ్గిపోయి ఇంకా దూరమయింది దానికి. ఇక అది నీకిచ్చే ఫలితమెలా పరిపూర్ణమవుతుంది. అదీ పరిమితంగానే లభిస్తుంది నీకు. కొంత మంచీ కొంత చెడ్డా. ఏదైనా కావచ్చు. ఎంత మోతాదులోనైనా కావచ్చు. నీవు కోరిందే జరుగుతుందనీ చెప్పలేము. కోరకున్నా జరగదనీ చెప్పలేము. అవి రెండూ సమస్యే నీకు. పరిష్కారం కాదు.
అయితే ఏమిటి పరిష్కార మార్గం. కర్మ కాదు. కర్మయోగ మవలంబించు. నీవు చేసే ప్రతి పనీ నేను గాదు చేయటమనుకో. మరి
Page 395