#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత

- పట్టుకొంటున్నా - ఉన్మిష న్నిమిషన్నపి - కండ్లు మూస్తున్నా తెరుస్తున్నా ఇలాంటివీ కర్మలంటే.

  ఇందులో చూడండి. శరీరానికి చెందిన వున్నాయి. ప్రాణానికీ ఇంద్రియాలకు చెందినవీ ఉన్నాయి. గృహన్ అనటంలో మనస్సుకు సంబంధించిన కర్మలూ ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో శబ్ద స్పర్శాదులతో సంబంధం లేకుండా అవి ఏర్పడవు కాబట్టి ఇటు పిండాండమే గాక అటు బ్రహ్మాండం కూడా కలిసి వస్తున్నాయి ఈ జాబితాలో. అందులో కూడా శాస్త్రీయమూ లౌకికమూ అనే విభాగం చూపకుండా ఏకరువు పెట్టింది. కాబట్టి గీత అనాత్మ క్షేత్రంలో జరిగే ప్రతి చలనమూ కర్మగానే భావించి చెబుతున్నట్టుంది.

  ఇప్పుడీ కర్మలన్నీ ప్రతిక్షణమూ జరుగుతుంటే ఆ జరుపుతున్నది నేను అని తన మీద కర్తృత్వం పెట్టుకో గూడదు జ్ఞాని. కర్తృత్వం పెట్టుకొంటే భోక్తృత్వం కూడా తన మెడకే చుట్టుకొంటుంది. అప్పుడు తాను తత్త్వవేత్త అనిపించుకోలేడు. అయితే ఒక ప్రక్క పశ్యన్ శృణ్వన్ అని తానే చేస్తూ తనకు కర్తృత్వం లేదని భావించట మెలాగా. తాను గాక ఆ పనిచేస్తున్న దెవరంటారు. ఎవడో చెబుతునప్పుడు గీత. ఇంద్రియాణీంద్రి యార్దేషు వర్తంత ఇతి. ఆయా ఇంద్రియాలాయా ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని భావిస్తుండాలట మనం. ఇంద్రియాలంటే చక్షురాదులైన జ్ఞానేంద్రియాలూ - వాగాదులైన కర్మేంద్రియాలూ - రెండు జాతులు. అంతేకాదు. అంతరింద్రియాలైన మనః ప్రాణాలు కూడా. అప్పటికి మనలో కలిగే ప్రతి కదలికా మనం చేస్తున్నది గాదు. మనమంటే మన ఆత్మ. అది పరిశుద్ధమైన చైతన్యం. అందులో ఏ కర్మా లేదు. అది కేవలం జ్ఞానం.

Page 393

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు