కర్మసన్యాస యోగము
భగవద్గీత
ఆ యా చరాచర పదార్ధాలూ వాటి కదలికలూ కూడా జ్ఞానానికి వ్యతిరిక్తంగా లేవు.
లేవు గనుకనే కదలకున్నా జ్ఞానమే. కదలినా అది జ్ఞానమే. ఎటు వచ్చీ ఇలాంటి అఖండ జ్ఞాన దృష్టి బలంగా ఉండాలి సాధకుడికి. ఉంటే వాడే పని చేస్తున్నా చేయని వాడే. నైవ కించిత్కరోమీతి. నేనే పనీ చేయటం లేదనుకోవాలట. ఎవడు. యుక్తామన్యేత తత్త్వవిత్. అసలైన ఆత్మ స్వరూపమేదో గుర్తించినవాడు. ఎలా గుర్తిస్తాడు. యుక్తః - కర్మయోగం పరిపాకానికి వస్తే. అప్పుడు ఆ జ్ఞానం వాడి కారూఢమవుతుంది. ఆ రూఢమైతే వాడు చేసే ఏ కర్మా కర్మ గాదు. జ్ఞానమే.
ఏ కర్మా అంటే ఏమిటర్ధం. ఎన్నో ఉన్నాయి ప్రతి దినమూ ప్రతి క్షణమూ మానవుడు చేసే కర్మలు. అవి శాస్త్రోక్తమే కానక్కరలేదు. సహజంగా సాగి పోయే లౌకిక కర్మలు కూడా. శారీరక కర్మలు కూడా. మనోవాక్కా యాలలో ఏ కదలిక కలిగినా అది కర్మే. జ్ఞాని అయిన వాడు తన దిన చర్యలో ఎప్పుడెలాటి కర్మ జరుగుతున్నా అది తాను చేశానని చేస్తున్నానని భావించరాదు. ఏమిటది. ఎలాంటిది. వర్ణిస్తున్నాడు పశ్యన్ చూస్తున్నా. శృణ్వన్ వింటున్నా - స్పృశన్ తాకుతున్నా జిష్రున్ మూర్కొంటున్నా - అశ్నన్ తింటున్నా - గచ్ఛన్ నడుస్తున్నా స్వపన్ నిద్రిస్తున్నా - శ్వసన్ గాలి పీలుస్తున్నా వదులుతున్నా ప్రలపన్ మాటాడుతున్నా - ఉత్సృజన్ - మల మూత్రాదులు విసర్జిస్తున్నా - గృహన్
Page 392