#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత

మేమిటి. ప్రతి వాడి ఆత్మా వాడి ఆత్మే. ప్రతి వాడూ అనాత్మగా భావించేది కూడా వాడికాత్మే. ఆత్మ తప్ప ఆనాత్మే లేదు వాడి దృష్టిలో. ఇక బంధమేముంది. అంతా మోక్షమే. ఇందులో కుర్వన్ అన్నప్పుడు కర్మ. నలిప్యతే అన్నప్పుడు జ్ఞానం. కర్మ సాగుతున్నా అది జ్ఞానమే. జ్ఞానం సాగితే కర్మ. కర్మ ఆగితే అది జ్ఞానం. రెండూ చెట్టపట్టాలు పట్టుకొని పక్క పక్కనే నడుస్తుంటాయి. రెండుగా గాదు. ఒకటిగా.

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యఞ్శృణ్వన్ స్పృశఞ్జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపఞ్శ్వసన్ || 8 ||

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ || 9 ||

  అసలు కర్మ జ్ఞాన మని ఎందు కంటున్నావు నీవు. రెండున్నాయా వాస్తవంగా. రెండు లేవసలు. ఉన్న దొక్క జ్ఞానమే. అదే కర్మగా భాసిస్తున్నది. జ్ఞానం వస్తువైతే కర్మ అనేది దాని ఆభాస. జలం వస్తువు తరంగ మాభాస. ఆ భాస వస్తువు కంటే అన్యంగా లేదు. జలమే తరంగ రూపంగా చలిస్తుంటే దాన్ని కర్మ అన్నావు. చలించకపోతే జ్ఞానమన్నావు. చలించకుంటేనే గాదు. తరంగ రూపం ధరించినా ఆ ధరించింది జలమే. కాదని తీరం దాకా పోతున్నా ఆ పోతున్నదీ జలమే. అలాగే జ్ఞానం ధరించిన అవతారాలే నామరూపాలు. వాటి ద్వారా ఏర్పడుతున్న క్రియలు కూడా జ్ఞానం చేస్తున్న క్రియే. అప్పటికి తరంగమూ దాని చలనమూ జలాని కస్యంగా లేనట్టే

Page 391

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు