కర్మసన్యాస యోగము
భగవద్గీత
పాటికివి ఎక్కడో ఉండి అది చెప్పిన మార్గంలో ఇవి నడుచుకొంటాయని గాదు మరలా. ఈ అనాత్మ ప్రపంచమంతా దానికతిరిక్తంగా ఎక్కడో ఉంటే గదా. ఇదం సర్వం యదయమాత్మా. ఈ కనిపించేదంతా వస్తుతః-ఆత్మేనని చాటుతున్న దుపనిషత్తు. అలాంటప్పుడివి దానికి వేరుగా ఎక్కడున్నాయి. కేవలమస్తి భాతి అని జ్ఞానంతో చూస్తే ఎక్కడాలేవివి. ఆత్మ గానే మారి పోయాయి. పోతే అప్పుడాత్మ అనాత్మ అనే విభాగం చెరిగిపోయి అంతా ఆత్మే వ్యాపిస్తుంది. కాబట్టి సర్వ భూతాత్మ భూతాత్మా. సమస్త భూతాలకూ ఆత్మ భూతమవుతాడు జ్ఞాని. సర్వేషాం బ్రహ్మా దీనాం స్తంబ పర్యంతానాం భూతానాం ఆత్మ భూతః ఆత్మా ప్రత్యక్షతయా యస్య అని విరిచి అర్ధం చెప్పారు భగవత్పాదులు. లోకంలో కనిపించే అన్ని చరాచర పదార్ధాలూ ఉపాధులైతే ఆ ఉపాధుల రూపంలో కనిపిస్తున్నది తన ఆత్మ చైతన్యం గానే దర్శిస్తాడు జ్ఞాని. అనాత్మ తన విభూతి Expansion. ఆత్మ తన స్వరూపం Substance. సముద్రానికి జలం స్వరూపమైతే తరంగ బుద్బుదాదులు దాని విభూతి. అవి ఆ జలాని కంటే భిన్నంగా లేవుకదా. అలాగే చైతన్యానికి భిన్నంగా మరేదీ లేదీ సృష్టిలో. శరీరమనః ప్రాణాదులూ లేవు. బాహ్యమైన వస్తుజాలమూ లేదు.
అలాంటప్పు డిక ఆత్మ కడ్డ మేముంది. అడ్డమీ నామరూపాలే దానికి. అవి కూడా ఇప్పుడాత్మగానే దర్శిస్తున్నాడు. కాబట్టి జ్ఞాని - కుర్వన్నపి నలిప్యతే. వాడే పని చేసినా దానిఫలితం వాడినంటదు. ఆ కర్మ -దాని ఫలమూ - అవి రెండూ కూడా ప్రపంచంతో పాటు తన స్వరూపంగానే మారి పోయాయి వాడికి. ఇక కర్మేమిటి. కర్మఫల మేమిటి. అంటట
Page 390