కర్మసన్యాస యోగము
భగవద్గీత
జ్ఞేయమూ కాదు. జ్ఞాతే అయితే జీవాత్మ అవుతుంది. జ్ఞేయమైతే భూతాత్మ అవుతుంది. అవన్నీ ఆత్మచేత గ్రహించబడేవి గాని గ్రహించేది గాదు. గ్రహించేది కూడా కాదా మాటకు వస్తే. కేవల గ్రహణమాత్రమే. స్ఫురణ మాత్రమే Pure consciousness.
మరి అలాంటప్పుడు శాస్త్రం కూడా ఎందుకిన్ని ఆత్మలను వర్ణించి చెప్పటం. అది తన దృష్టితో కాదు. లోకదృష్టి ననుసరించి చెబుతున్నది. మీరెక్కడి కక్కడ చూచి అదే ఆత్మ అని భ్రమ పడుతున్నారు. అందుకే అసలైన ఆత్మఏదో మరుగుపడి పోయింది మీదృష్టికి. కనుక వీటన్నిటినీ శోధించి లోలోపలికి వెళ్లి చూడండి. అప్పుడసలైన ఆత్మ ఏదో మీకు ప్రకటమై కనిపిస్తుందనే సత్యాన్ని బయట పెట్టటాని కిన్ని అసద్రూపమైన ఆత్మల నుదాహరిస్తున్నది గీతా శాస్త్రం.
కాబట్టి విశుద్ధాత్మ అంటే విశుద్ధ సత్త్వః అని అర్ధం వ్రాశారు గురువుగారు. సత్త్వమంటే అంతః కరణం. అది నీవు ఆత్మ అని గ్రహిస్తున్నావు. అది కాదు ఆత్మ. దాన్ని బాగా శుద్ధి చేసుకొని చూడు అని బోధిస్తున్నది గీత. శుద్ధి చేసుకొంటే ఏమవుతుంది. విజితాత్మా అంటున్నది గీత. ఇక్కడ ఆత్మ అంటే దేహమని అర్థమట. మనస్సు శుద్ధి చెంది నీకు స్వాధీనమయితే దేహం కూడా నీవు చెప్పిన మాట వింటుంది. అవి రెండూ ఎప్పుడు నీవశంలో ఉంటాయో ఇక ఇంద్రియాల దేముంది. జితేంద్రియః - దశేంద్రియాలూ నీ చెప్పుచేతలలో ఉండక తప్పదు.
మనః ప్రాణదేహేంద్రియా లధీన మవుతాయంటే దేని కధీనం. ఆత్మకు. ఆత్మ కధీన మవటమంటే ఆత్మ వేరుగా ఎక్కడో ఉండి ఇవి వీటి
Page 389