#


Index



కర్మసన్యాస యోగము భగవద్గీత


సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ || 1 ||

  కృష్ణా ఏమిటీ అన్యాయం. సన్యాసం కర్మణాం - కర్మలను సన్న్యసించమనీ చెబుతావు. పునర్యోగంచ శంససి. మరలా కర్మలా చరించమనీ చెబుతావు. ఇది పరస్పర విరుద్ధం కాదా. ఇంతకూ ఆచరించ మంటావా కర్మ - వదిలేయ మంటావా. సన్న్యాస మంటే వదిలేయటం. యోగమంటే ఆచరించటం రెండూ ఒకే వ్యక్తి ఒకే మారు చేయలేడు గదా. రెండూ మాకు బోధిస్తా వేమిటి. ఏదీ ఎక్కడ బోధించాడు కృష్ణుడు. ఇంతకు ముందు అధ్యాయంలో చివరిసారిగా బోధించింది అదే. యోగ సన్న్యస్తకర్మాణమనే శ్లోకంలో సన్యాసం చెప్పాడు. ఛిత్వైనం సంశయం యోగమా తిష్ఠ అనే చోట మరలా యోగం చెప్పాడు. అందుకు ప్రశ్నిస్తున్నా డర్జునుడు - రెండూ చెబుతా వేమిటి ఏదో ఒకటి చెప్పమని.

  యచ్ఛేయ ఏతయో రేకం. ఏదో ఒకటి బోధించుమాకు. అది కూడా మాకు శ్రేయస్సు కలిగించేదయి ఉండాలి. ఏది ప్రశస్తమో అదే ఆచరించాలి మానవుడు. దానివల్లనే ఫలిత ముంటుంది. పనికి రాని దాచరిస్తే కాదు. అంచేత కర్మానుష్ఠాన మా కర్మ పరిత్యాగమా ఏది సిఫారసు చేస్తావు మాకు. దేనివల్ల మాకు సత్ఫలిత ముంటుంది. తన్మే బ్రూహి సునిశ్చితం.ని ష్కర్షగా తేల్చి చెప్పుమాకు. ఫలితమివ్వకపోతే నీవు బోధించి ఏమి సుఖం. ఇలా నిలదీసి అడిగితే చెబుతున్నా డిప్పుడు భగవానుడు.

Page 374

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు