కర్మసన్యాస యోగము
భగవద్గీత
చూపాడు. అది మామూలుగా చూచే మనబోటి లోకుల కర్ధమయిందో లేదో నని సందేహించి లోకదృష్టి ననుసరించి రెండింటినీ విడగొట్టి చూపాడు మళ్లీ. కర్మయోగమనే అధ్యాయంలో కర్మ స్వరూపాన్ని - జ్ఞాన యోగమనే అధ్యాయంలో జ్ఞాన స్వరూపాన్ని వివరించి చెప్పాడు. అలా విడగొట్టే సరి కదే వాస్తవమని భ్రాంతి పడతామేమోనని మళ్లీ ఇప్పుడా రెండింటినీ కలిపి సమన్వయం చేసి చూపుతున్నాడు. మొదట ఏకత్వాన్ని ప్రస్తావించి మధ్యలో అనే కత్వాన్ని వర్ణించి చివరకు మరలా ఏకత్వాన్ని . From Synthesis to Synthesis via Analysis అని ఎప్పుడూ చెబుతుంటాను నేను. ఉపనిషత్తు బోధనా మార్గ Method ology మిదే. ఏకమేవాద్వితీయమని మొదట ఏకత్వాన్ని చాటి చెప్పింది ఛాందోగ్యం. మధ్యలో తత్తేజ అసృజత - అప అసృజత - అన్న మసృజత అని అనే కత్వాన్ని చాటుతుంది. చివరకు సయఏషోణిమా. ఐతదాత్మ్య మిదం సర్వం తత్సత్యం స ఆత్మా అని ఏకాత్మ భావాన్నే నిరూపిస్తుంది. మరి ఆయన వేదవ్యాసుడు కదా. వేదంలో ప్రక్రియనే Method అనుసరించి బోధిస్తున్నాడు మనకు. ఏమిటి కర్మ సన్యాసం. అంటే ఏమిటర్ధం. కర్మ జ్ఞానాని కన్యమనే భావాన్ని వదులుకో. దాన్ని జ్ఞానంతాలూకు విభూతి అనే భావంతో జ్ఞానంలోనే చేర్చుకో. అలా భావిస్తే ఇక జ్ఞానకర్మలు పరస్పర విరోధులు కావు - ఏకమేననే అద్వైత దృష్టి గట్టి పడుతుంది సాధకుల మైన మనకు. ఇది కర్మ సన్యాసమనే నామ కరణంలో దాగి ఉన్న పరమ రహస్యం. ఇది ఇంత రహస్యమయ్యే సరి కర్ధం చేసుకోలేక అడుగుతున్నా డిప్పుడర్జునుడు.
Page 373