#


Index



కర్మసన్యాస యోగము భగవద్గీత








5. కర్మ సన్న్యాస యోగము

  ఇప్పటికి నాలు గధ్యాయా లయి ప్రస్తుత మయిదవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. దీని పేరు కర్మసన్న్యాస యోగం. సన్న్యాస మంటే వదిలేయటమే కాదు. ఉంచటమని కూడా అర్ధం చెప్పుకొన్నాం. జ్ఞానంతో కర్మను వదిలేయమని ఒక అర్ధమైతే జ్ఞానంతో కర్మను చేర్చి రెండింటినీ ఏకంగా చూడటమని మరొక అర్థం. అసలా మాటకు వస్తే జ్ఞానమూ కర్మా ఇవి రెండే ఉన్నాయి సృష్టిలో. పరమాత్మ జ్ఞాన స్వరూపుడైతే ఆయన సృష్టించిన ఈ ప్రపంచమంతా కర్మ స్వరూపం. అచలమైనది జ్ఞానమైతే దాని చలనం కర్మ. పరమాత్మ చలించకపోతే ప్రపంచ మెలా ఏర్పడింది. ప్రపంచమంటే బాహ్యమైన బ్రహ్మాండమే Macro కాదు. అంతరమైన పిండాండం Micro కూడా. అది సమష్టి. ఇది వ్యష్టి. రెండూ పరమాత్మ

Page 369

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు