జ్ఞాన యోగము
భగవద్గీత
వేయటమసంభవం. బద్ధుడు కాడు వాడు ముక్తుడు. కర్మ లసలే ఉండవా అంటే ఉంటాయి. అయితే చచ్చిన పాములు. గుణ చేష్టారూపంగా నడుస్తుంటాయి. అవి ఉన్నా ప్రతీతి మాత్రమే Apparant గాని వాస్తవం Actual కావు.
తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాఽఽత్మనః |
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత || 42 ||
అంచేత ఇక నీకు చెప్పేదేమీ లేదు. నీవు చేయ వలసిన పని ఒకటే. అజ్ఞాన సంభూతం హృత్సం సంశయం - అజ్ఞానం వల్ల ఏర్పడి నీ మనసులోనే తిష్ఠవేసుకొన్న ఈ సంశయమనే దయ్యాన్ని ఛిత్వా సమూలంగా ఛేదించి పారేయి. ఛేదించాలంటే సాధ్యమా అని దిగులు పడకు – జ్ఞానాసినా ఆత్మ జ్ఞానమే ఒక తీక్షణ దీర్ఘ కరవాలం. ఆ ఖడ్గంతో నరికిపారేయి దాన్ని. సమూలంగా నిర్మూల మయి పోతుంది. పోతుందా అని మరలా సందేహించకు. అది వాస్తవం కాదు ఆ భాస. జ్ఞానం లేనంత వరకే అస్తిత్వం దానికి. జ్ఞానముద యించిందో సూర్యోదయమైతే తమస్సులాగా విరిసిపోక తప్పదు. యోగమాతిష్టోత్తిష్ఠ - అలా దాన్ని ముందు నిర్మూలించి తరువాత ఏకర్మ అయినాచేయి. అది నిన్ను బంధించదు. జ్ఞానంతో చేసిన కర్మ కర్మకాదు. మరేమిటి. జ్ఞాన విభూతి జ్ఞానం స్వరూపం కర్మదాని విభూతి ఇక వైరుధ్యమే ముంది. రెండూ నీ స్వరూపంగానే నీకు అనుభవానికి
Page 367