జ్ఞాన యోగము
భగవద్గీత
సాంఖ్యంచ యోగంచ - అని చెప్పే వ్యాసవాక్య మెలా చెల్లుతుందని మరలా ప్రశ్న. కర్మ అంటే నిత్యనైమిత్తికాదులైన శాస్త్రీయ కర్మలున్నాయి. అందులో అహంకార మమకారాలు కొట్టివేసి సమత్వ బుద్ధితో నిర్లిప్తంగా చేసే కర్మలున్నాయి. ఇందులో శాస్త్రోక్త కర్మలను మనసులో పెట్టుకొని చెప్పిన మాట భగవత్పాదుల మాట రెంటకీ సముచ్చయం పనికిరాదని. ఆ దృష్టితో అది కరెక్టు. పోతే అవే సమత్వబుద్ధితో నిష్కామంగా చేసే కర్మలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట వేద వ్యాసుని మాట జ్ఞానం కర్మా రెంటికీ పేచీ లేదని. అలాంటప్పుడు జ్ఞానంతో పాటుండవచ్చు కర్మ. లేదా కర్మ యోగం. శాస్త్రీయమైన దనుష్ఠానమైతే ఇది యోగం. యోగం జ్ఞానానికి విరోధి గాదు. మీదు మిక్కిలి సహకారి. కాబట్టి సన్న్యస్త కర్మాణ మంటే శాస్త్రీయ కర్మ స్నన్యాసమని అర్థం. అంతేగాని కర్మయోగం కాదు. ప్రారబ్ధ కర్మలూ కావు.
జ్ఞాన సంఛిన్న సంశయం ఇలాంటి సమన్వయ రూపమైన ఆత్మజ్ఞాన మెప్పుడేర్పడిందో ఇక ఎలాంటి సందేహాలూ ఉండబోవు. అన్నీ సంఛిన్నం. పటాపంచెలయి పోవలసిందే. పోతే ఇక మిగిలింది ఆత్మైకత్వమే. ఆత్మవంతం. ఆత్మా అనాత్మా అనే తేడా లేకుండా అంతా అలికేసినట్టు ఆత్మగానే చూస్తుంటాడు జ్ఞాని. అనాత్మ గంధం కూడా లేదు కాబట్టి పరాకు చెందే ప్రసక్తే లేదు. అప్రమత్తంగా జీవితం సాగిస్తుంటాడు. కర్మాణిన నిబధ్నంతి - అలాంటి జ్ఞానికే కర్మా అంటదు. అంటకనే పోతే వాణ్ణి కట్టి
Page 366