జ్ఞాన యోగము
భగవద్గీత
చేసుకో లేడు మనస్సుకు. అందుకే పాపిష్ఠః సంశయః అని గురువుగారు త్రోసిపుచ్చుతారు.
యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ || 41 ||
సరే నిస్సం శయ మయింది మనస్సు నిశ్చయ జ్ఞాన మేర్పడింది. జ్ఞానంకలిగిన తరువాత మరలా కర్మలు చేయవచ్చా. పైగా కర్మ చేయ కుండా ఒక్క నిమిషమైనా నిలకడగా కూచోలేడు గదా మానవుడు మరి జ్ఞానంతోపాటు కర్మ ఉండవచ్చా. అని అడిగితే సమాధాన మిస్తున్నది గీత. యోగ సన్న్య్సస్తకర్మాణం యోగమంటే ఇక్కడ జ్ఞానయోగం. పరమార్థ దర్శన లక్షణేన యోగేన అని అర్థం చెప్పారు భాష్యకారులు. ఆత్మ జ్ఞాన ముదయిస్తే చాలు. సూర్యోదయమైతే చీకటిలాగా కర్మ విరిసి పోతుంది నిలవలేదు. సన్న్యసించ వలసిందే కర్మలు. మరి నహి కశ్చిత్ క్షణమపి అనే గీతా వాక్యాని కర్థమేమిటి.
ఇక్కడే ఉందొక సూక్ష్మం అది ఇంతకు ముందే వర్ణించాము అయినా సందర్భం వచ్చింది కాబట్టి వివరించాలి. కర్మా జ్ఞానం రెండూ రాజీ పడతాయా లేక పేచీ పడతాయా అని ప్రశ్న వచ్చింది. రాజీ పడవు ఎప్పుడూ పేచీయే నంటారు భగవత్పాదులు. జ్ఞాన కర్మ సముచ్చయ మొప్పు కోరాయన. అలాగైతే కర్మ యోగం బుద్ధి యోగం రెండూ ఒక్కటే ఏకం
Page 365