#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  నమ్మని వాడ శ్రద్ధ ధానుడు. ఎటూ తేల్చుకోలేక సతమత మయ్యేవాడు సంశయాళువు. ముగ్గురూ ముగ్గురే ఎవడూ దాన్ని భేదించ లేదు. గ్రహింహలేదు. తరించలేదు. Positive కాదది Negetive Approach. ఉత్తర ధ్రువం వైపు వెళ్ల వలసినవాడు దక్షిణ ధ్రువం వైపు వెళ్లి ఏమిసుఖం ఉత్తరాన ఏ కొండలున్నాయో నదులున్నాయో పట్టణాలున్నాయో చూడలేడు. ఆనందించలేడు. అలాగే వీరూ తత్త్వమేమిటో గుర్తించలేక దానికి దూర దూరంగానే పారిపోతారు. దూరంగా పోతే ఏమవుతుంది. సంసార సాగరంలోనే తల మునకలయి ఎప్పటికీ చేరలేరు జీవిత గమ్యం.

  అందుకే శాపం పెడుతున్నది గీత. నాయం లోకోస్తి న పరః అని. ఇహమూలేదు పరమూ లేదలాంటి మానవుడికి - అందులోనూ సంశయా త్ముడికి. న సుఖం సంశయాత్మనః - వాడికైహిక సుఖమూ లేదాముష్మిక సుఖ మంత కన్నాలేదు. సంశయాత్మా వినశ్యతి. అనుమానం పెను భూత మన్నట్టు వాడి అనుమానమే ఒక దయ్యమయి వాణ్ణి చివరకు రూపు మాపుతుంది. ఎలా గంటే అజ్ఞుడి కంత హాని లేదు. తనకు తెలియక పోయినా తెలిపితే ఎప్పటికైనా తెలుసుకొంటాడు. అశ్రద్ధా ళువూ అంత పాపాత్ముడు కాడు సహేతుకంగా సోదాహరణంగా బోధిస్తే చాలు నమ్ముతాడు పోతే కొంత ఇటూ కొంత అటూ ప్రసరించే మనస్సున్నవాడి కెలా చెప్పినా ఎంత చెప్పినా మళ్లీ మళ్లీ ప్రశ్నలు వేస్తూ పోతాడేగాని నిశ్చయం

Page 364

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు