జ్ఞాన యోగము
భగవద్గీత
మచిరేణాధి గచ్భతి అంటున్నది గీత అత్యంత శాంతి యుతమైన మోక్షాన్ని చవిచూడవచ్చు సాధకుడు. అది కూడా కాలాంతరంలో కాదు. కలుగుతుందో లేదోనని సందేహించబనిలేదు. అచిరేణ వెంటనే. జ్ఞానం లభించిందో లేదో శాంతి కూడా అప్పుడే లభిస్తుంది. కర్మకూ జ్ఞానానికీ ఇదే ముఖ్యమైనతేడా కర్మ ఫల మిప్పుడేరాదు. ఎప్పుడో చచ్చిన తరువాత మరి జ్ఞాన ఫలమో ఇప్పుడే ఇక్కడే. ఇదీ జ్ఞానంలో విశేషం.
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః || 40 ||
పోతే ఈ విషయంలో ఎలాంటి అపనమ్మకమూ పెట్టుకో నక్కరలేదు జ్ఞాన సాధకుడు. అనుమానం ప్రాణ సంకట మన్నారు. చాలా పాపిష్ఠ మైనది అనుమానం నమ్మకముండాలి ఏ విషయంలోనైనా. లేకుంటే దాన్ని దీక్షతో మనం సాధించలేము అజ్ఞానీ - అవిశ్వాసీ - సంశయాళూవూ Agnostic - Heretic sceptic అని పేర్కొంటారు. ఒకటి తెలియనివాడు అజ్ఞాని. తెలిసినా దాని విషయంలో నమ్మకం లేనివాడు అవిశ్వాసి. అసలది ఉందా లేదా అని ఎప్పుడూ డోలాయ మానంగా బ్రతికేవాడు సంశయా త్ముడు.
ఇది లోకంలోనే కాదు. ఆత్మ విషయంలో కూడా ఇదే వరస. ఆత్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలియని వాడజ్ఞుడు. దాన్ని అసలు
Page 363