#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  క్రియలు యాంత్రికంగా చేయవచ్చు. అలా చేసే వారందరూ నిజాయితీ పరులని చెప్పలేము. ఆషాఢభూతులు కూడా ఉండవచ్చు వారిలో. కనుక జ్ఞాన మనే ఫలం తప్పకుండా లభిస్తుందని చెప్పలే మంటారాయన.

  మరి తప్పకుండా లభించే మార్గ మిక ఏమిటని అడిగితే గీత వర్ణిస్తున్నది. శ్రద్ధావాన్ లభతే అని. శ్రద్ధా - తత్పరత్వమూ ఇంద్రియ నిగ్రహమూ ఈ మూడు లక్షణాలూ ఉంటే సాధకుడికి అవశ్యంగా లభిస్తుంది ఆత్మజ్ఞానం జ్ఞానం కోసమే గురూప సదనం చేయటం శ్రద్ధ. ఎలాగైనా సంపాదించాలనే పట్టుదల తప్ప మరేదీ అక్కరలేదని దాని మీదనే దృష్టి పెట్టుకొని అదే లోకంగా బ్రతకటం తత్పరత్వం. మరి దాన్ని ప్రక్కకు లాగే ఏ విషయాలమీదికీ మనసు గాని ఇంద్రియాలు గాని పరుగెత్త కుండా Restraint.

  ఇవి మూడూ అలవరుచుకొంటే మాత్రం జ్ఞానం లబ్ధ్వా. ఆత్మజ్ఞానం అవశ్యంగా ఉదయిస్తుంది. అది గురువు గారి ఉపదేశం మూలాన్నే అంటే గురూపదేశం ప్రణిపాతాదుల వల్లనే కాదు. ముఖ్యంగా ఈ మూడింటి వల్లనే ఫలిస్తుందని అర్థం. అయితే ప్రణి పాతాదు లక్కరలేదా అంటే లేదనము మేము. దీని కవి ఆనుషంగికం Aceessory ఇవి ఉంటే అవి తప్పకుండా పట్టు పడతాయని భావం. అయితే ఇంత ప్రయాసపడి మనం జ్ఞానం సంపాదిస్తే మనకు కలిగే ఆ మహాఫలమేమిటి. పరాం శాంతి

Page 362

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు