#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  చెబుతున్నాడు. యోగసంసిద్ధః కొంత కాలం కర్మయోగమూ సమాధి యోగమూ అవలంబించి చిత్త శుద్ధి నార్జించాలి సాధకుడు. అప్పుడే జ్ఞానానికి యోగ్యత. అది కూడా జిజ్ఞాసకూ ముముక్షకూ దారితీస్తే శ్రవణ మనన ధ్యానాదులు అభ్యసించి తత్ఫలితంగా సంపాదించ గల మా జ్ఞానం. కాలేన అంటున్నది గీత. తొందరపడ గూడదు. అభ్యసిస్తూ పోతే కాల క్రమేణా అదే పరి పాకానికి వచ్చి జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. ప్రయత్నం వల్లనే పనులు జరుగుతాయి గాని ఊరక ఆశపడితేగాదు.

శ్రద్ధావాంల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి || 39 ||

  ప్రయత్నం వల్లనే పని జరుగుతుంది. జ్ఞానమనేది సిద్ధించటానికి కూడా ప్రయత్న మవసర మన్నారు. అంతకు ముందు చెప్పారు గదా ప్రణి పాతేన పరిప్రశ్నేన అని. అదికాక ఇంకా ప్రయత్నమేమిటి నిజమే అదీ ప్రయత్నమే కాదనలేదు. కాని అది మాత్రమే చాలదు. బాహ్యమైన క్రియ అది. సాధకుడి లక్షణం కాదు. అందులో మోసమున్నా ఉండవచ్చు. పది మంది మెచ్చుకోవాలని ప్రదర్శన చేసినా చేయవచ్చు. చివర కాషాఢ భూతిలాగా గురువు గారి సొమ్మేదైనా దోచుకొని పారిపోయినా పోవచ్చు. అదే అంటున్నారు జగద్గురువులు కూడా. ప్రణిపాతాదిస్తు బాహ్యః అనైకాంతి కోపి భవతి - మా యావి త్వాది సంభవాత్ - బాహ్యమైన ప్రణి పాతాది

Page 361

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు