#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  ఇంతకూ జ్ఞానమనేది చాలా గొప్ప విలువైన పదార్థం. మిగతా జ్ఞానాల లాంటిది కాదది. కర్మల లాంటిది కాదు. భౌతికమైన ద్రవ్యాల లాంటి దసలే కాదు. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే దానికి సాటియైనదీ లేదు పవిత్రమైనదీ లేదు సృష్టిలో ఆత్మ జ్ఞానమే గదా జ్ఞాన మిక్కడ ఆత్మకు సాటి మరి ఏమున్నది. అది ఏకమే వాద్వితీయం. దానికి సాటి చెప్పవలసిందే దైనా ఉంటే అది ఇక అనాత్మ ప్రపంచమే. అది ఆత్మకు వేరుగా అసలే లేదు గదా. ఇక దానికి సాటి ఏది చెబుతావు. అలాగే పవిత్రం కూడా జ్ఞానం. పావనమైనదీ అదే. పావనం చేసేదీ అదీ. పావన మంటే శుద్ధం. శుద్ధం బుద్ధ మన్నారు. దాన్ని నిరాకారమూ సర్వవ్యాపకమూ అయిన జ్ఞానం శుద్ధంగాక మలిన మెలా కాగలదు. ఆకాశం లాగా ఎప్పుడూ నిర్మల మైన తత్త్వమది. తాను నిర్మలం కావడమే గాక తనకు భిన్నమైన దాన్ని కూడా నిర్మలం చేయగలదు. భిన్నమైన అనాత్మ ప్రపంచం వస్తుసిద్ధంగా అసలు లేకపోయినా ప్రతీతి సిద్ధంగా Apparant ఉంది. అది కూడా జ్ఞానోదయమైతే ఒక స్వప్నంలాగా విరిసిపోతుంది. అదే శుద్ధి చేయట మంటే.

  అయితే ఈ జ్ఞాన మెలా లభిస్తుంది మనకు. తత్స్వ్యయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఆచార్యుడు మనకెంత బోధించినా మనం దాని నందుకొనే ప్రయత్నం చేయనంతవరకూ సిద్ధించదది. కనుకనే

Page 360

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు