#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  సామర్థ్యాత్ యేన కర్మణా శరీరమారబ్ధం తత్ప్ర వృత్తఫలత్వా దుపభోగేనైవ క్షీయతే - ఇప్పుడున్న ఈ శరీరమే కర్మతో ప్రారంభయిందో ఆ ప్రారబ్ధ కర్మ మాత్రం తొలగి పోదు. అది ప్రవృత్త ఫలం ఫలమేర్పడిందీ పాటికే. కాబట్టి ఫలాను భవంతోనే గాని అది క్షీణించదు అనుభవం పూర్తి కాగానే జ్ఞానికిక ఐహిక జీవితం లేదు. అంతవరకూ జీవన్ముక్తుడు. అప్పటినుంచీ విదేహ ముక్తుడు.

  మరి అలాంటప్పుడు సర్వ కర్మలనే మాట కర్ధమేమిటి. యాని అప్రవృత్త ఫలాని జ్ఞానోత్పత్తేః ప్రాక్కతాని జ్ఞాన సహ భావీనిచ అతీతా నేక జన్మాంతర కృతానిచ తాన్యేవ సర్వాణి భస్మసాత్కురుతే అని వివరణ ఇచ్చారాయన. అది ఎలాగంటే ఇంకా ఫలిత మారంభం కాని కర్మలు మూడున్నాయి. జ్ఞాన ముదయించక ముందు ఈ జన్మలో చేసినవి ఒకటి. జ్ఞానంతో పాటు ఈ జన్మలోనే చేస్తున్న కర్మలొకటి అలాగే పూర్వ జన్మలలో చేసిన కర్మలొకటి ఇందులో పూర్వం చేసిన వాటికి సంచిత మని పేరు. జ్ఞాన దృష్టితో చేస్తున్న వాటి కాగామి అని పేరు. ఇదుగో ఈ సంచితాగా మికర్మలే సర్వ కర్మలనే మాట కర్థం. వాటిని మాత్రం జ్ఞానం నిర్వీర్యం చేసి పారేస్తుంది. ఇక పునర్జన్మ భయం లేదు జ్ఞానికి.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్ స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి || 38 ||

Page 359

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు