జ్ఞాన యోగము
భగవద్గీత
సామాన్య జ్ఞానం కావు. విశేషాల తాలూకు జ్ఞానం జన్మిస్తుంది - నశిస్తుంది. ఎప్పటికీ ఉండేదిగాదు. మరి ఏ జ్ఞానమైతే శాశ్వతం. అత్మ జ్ఞానమొక్కటే అలాంటిది. ఆత్మ ఎలా రాదో పోదో నిత్యసిద్ధమో Eternal దానికి సంబంధించిన జ్ఞానం కూడా అలా నిత్య సిద్ధమే. ఇలాంటి జ్ఞానమే బోధిస్తారు సద్గురువులు మనకు.
అలాంటి బోధనందు కొన్నందు కే మిటి మనకు కలిగే ఫలితం. ఎప్పుడూ ఫలితాన్ని బట్టే విలువ వస్తుంది పదార్థానికి. మామూలు జ్ఞానం వల్ల కలిగే మామూలు ఫలితం కాదు. మహాఫల మన్నారు పెద్దలు దీన్ని. యద్ జ్ఞాత్వా న పున ర్మోహమేవం యాస్యసి ఆ ఒక్క జ్ఞాన మార్జిస్తే చాలు మళ్లీ ఇలాంటి వ్యామోహం తొంగిచూడడు మన జీవితంలో అజ్ఞానమనే పిశాచి పూర్తిగా ఉచ్చాటన మయి పోతుంది. ఇక మన కేసమస్యా ఉండబోదు. అవిద్యాకామ కర్మలేగా సమస్యలు. వాటివల్లనేగా కారణ సూక్ష్మ స్థూల శరీరాలు మూడూ వచ్చి చుట్టుకొన్నాయి మనలను. అదేగా సంసార బంధం ఆత్మజ్ఞానం లేకనే అవి బలంగా వచ్చి మీదబడ్డాయి. ఇప్పుడాజ్ఞాన భాస్కరుడు దయించాడు. ఇక మనలనీ అవిద్యాంధకారమేమి చేయగలదు. ఉంటేగా చేయటానికి. పటా పంచెలయి పోతుంది.
అంతేకాదు యేన భూతా న్యశేషేణ ద్రక్ష్యస్యాత్మని ఇది ప్రతిలోమంగా మనకు కలిగే ఫలితమైతే అనులోమంగా మనకు సిద్ధించే
Page 355