జ్ఞాన యోగము
భగవద్గీత
గాని కన్న వారు గాక పోవచ్చు. కన్న జ్ఞానమే అపరోక్షం ఎలా ఉంటుందది. ఇంతకు పూర్వం చెప్పి ఉన్నారు. భగవత్పాదులు సమ్యక్ ప్రమాణ జనితా పరమార్థ దర్శన లక్షణా బుద్దిః అని. సమ్యక్రమాణం వల్ల కలగాలట అది. అసమ్యక్రమాణం వల్లకాదు. రజ్జువును రజ్జువేనని చూస్తే అది సమ్యక్ దాన్నే సర్పమని చూస్తే అది అసమ్యక్. అలాగే బ్రహ్మతత్త్వాన్ని ఆత్మగానే దర్శించాలి. అనాత్మ రూపమైన ప్రపంచంగా దర్శించ గూడదు అలా ఆత్మ స్వరూపంగా దర్శిస్తున్నవాడే అసలైన గురువు వాడిదే ప్రామాణికమైన జ్ఞానం. తైరుప దిష్టం జ్ఞానం కార్యక్షమం భవతి అంటారు గురువు గారు. అలాంటి వారు పదేశిస్తేనే నీకా జ్ఞాన ముపయోగ పడుతుంది. అసలైన తత్త్వాన్ని అనుభవానికి తెస్తుంది. కనుక సద్గురువు నెన్నుకోటంలో జాగ్రత్త పడాలి శిష్యులు జ్ఞాన విజ్ఞానాలు గురువు కుండవలసిన లక్షణా లైతే ప్రణిపాత ప్రశ్నసేవాదులు శిష్య లక్షణాలు.
యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి || 35 ||
మరి వారుపదేశించేది మనం గ్రహించేది జ్ఞానమైనా ఎలాంటి జ్ఞాన మనుకొంటున్నారు. ఏ జ్ఞాన మంటే ఆ జ్ఞానం కాదు లోక జ్ఞానమా అదికాదు. కళాజ్ఞానమా అది కాదు. భౌతిక శాస్త్ర జ్ఞానమా అది కాదు. ఆఖరుకు ధర్మ జ్ఞానమా అదీ గాదు. ఎందుకు కాదు. ఇవన్నీ విశేష జ్ఞానమే
Page 354