జ్ఞాన యోగము
భగవద్గీత
డెవడా ఎక్కడ దొరుకుతాడా అని వాడికోస మన్వేషణ చేసి పట్టుకోవాటి. వాడు నీ దగ్గరికి రాడు. నీవే వాడి దగ్గరికి వెళ్లాలి. అంగడి వాడు మన ఇంటికి రాడు. మనమే అంగడికి వెళ్లి కావలసిన సరుకు కొనితెచ్చుకోవలసి ఉంటుంది. అలాగే తద్విద్ధి అలాంటి మహానుభావుడి వద్దకు వెళ్లు ప్రణిపాతేన - వినయ విధేయతలతో వాడి కాళ్ల మీద పడు. పరిప్రశ్నేన ఊరక పడటం వరకే గాదు వాడెందుకు వచ్చావు బాబూ అని అడిగితే నీవు నీ సందేహాలన్నీ అడిగి తెలుసుకో. ఎలా ఉంటాయా సందేహాలంటే అనుకరించి మాటాడు తున్నారు భాష్యకారులు. కధం బంధః కధం మోక్షః కావిద్యా కాచా విద్యా - బంధమెలా వచ్చింది. మోక్షమెలా వస్తుంది మనకు. మోక్షానికి కావలసిన విద్య ఎలాంటిది. దానికి దూరం చేస్తున్న అవిద్య ఏమిటి. ఇలా అడగటమే గాక వాటికాయన వివరణ ఇచ్చే వరకూ తొందర పడి వెళ్లిపోక అను దినమూ ఆయనను వదలి పెట్టకుండా తన మీద అనుగ్రహం కలిగే వరకూ సేవిస్తూ పోవాలి.
అలా చేస్తూ పోతే నీ కార్యదీక్ష చూచి ప్రసన్నుడయి నీకు జ్ఞానోపదేశం చేయగలడా గురువు. గురువు జ్ఞానవంతుడే కావచ్చు. ఎలాంటిదా జ్ఞానం. మెదటి కోవకు చెందిందా. రెండవ దానికి చెందినదా పరోక్షమా అపరోక్షమా. వ్రాస్తున్నారు భగవత్పాదులు. జ్ఞానవంతోపి కేచిత్ తత్త్వదర్శన శీలాః అపరేతున. జ్ఞానులయి కూడా కొందరు తత్త్వాన్ని గూర్చి విన్న వారే
Page 353