#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  పరిష్కరించుకోక పోగా ఇంకా నెత్తికి తెచ్చుకొంటున్నాడు మానవుడు. కాబట్టి కర్మోపాసనాదులు కర్తవ్యం కాదు జీవితానికి కర్తవ్యం జ్ఞాన సముపార్జనమే.

  అది ఎలా ఆర్జించాలా జ్ఞానమని అడిగితే సమాధానమిస్తున్నాడు గీతాచార్యుడు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శిన: - జ్ఞానులైన వారే నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానం లేనివాడి కెవడివ్వాలి జ్ఞానం జ్ఞానమున్న వాడే. డబ్బులేని వాడికి డబ్బున్న వాడే గదా దానం చేస్తాడు. తృణమో పణమో. లేని వాడేమి చేస్తాడు. వాడికే లేకుంటే వీడికేమివ్వగలడు అలాగే జ్ఞానవంతుడే ఇవ్వాలి జ్ఞాన ధనాన్ని. అయితే జ్ఞానం మాత్రముంటే చాలదు వాడికైనా జ్ఞానిన స్తత్త్వదర్శినః జ్ఞాన మనేది కేవలం సిద్ధాంత జ్ఞానమైతే ప్రయోజనం లేదు. సిద్ధాంతం Theory దృష్టాంతమయి Exprience ఉండాలి. అదే తత్త్వదర్శనం తత్త్వాన్ని ముఖాముఖిగా చూచి ఉండాలి వాడు. అది పరోక్షమైతే ఇది అపరోక్షం. రెండూ జ్ఞానమే. రెండూ జ్ఞానంలో రెండు భూమికలు. రెండూ ఉన్నప్పుడే ఆ జ్ఞానం పరిపూర్ణం. ఇలాంటి పరిపూర్ణ జ్ఞాన సంపన్నుడే సద్గురువు. వాడే తన్నాశ్రయించిన శిష్యులకు ఉపయోగ పడగలడు.

  ఇదుగో ఇలాంటి గురువును పట్టుకోవాలి సాధకుడు. అలాంటి సద్గురువు లెందరో ఉండరు. చాలా అపురూపం కనుక ఏ బాబానో గూబానో పట్టుకొని వాడే మనల నుద్ధరిస్తాడని బోల్తాపడక అసలైన ఆచార్యపురుషు

Page 352

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు