జ్ఞాన యోగము
భగవద్గీత
కర్మ - భక్తి - యోగం - అనే ప్రశ్నేలేదు. అన్నీ క్రియలే. జ్ఞానం క్రియగాదు వస్తువు. క్రియ వస్తువులోనే ఉదయిస్తుంది. వస్తువునే పట్టుకొని సాగిపోతుంది. చివరకు వస్తువులోనే అంతమవుతుంది. ఇంతెందుకు మన జ్ఞాన మొక వస్తువు దానిలో నుంచే వృత్తులు దయిస్తున్నాయి. అవి మానసికంగా వాచికంగా కాయికంగా సాగుతున్నాయి. అవి క్రియాత్మకమైన ప్రాపంచిక పదార్థాలతో సంబంధం పెట్టుకొంటున్నాయి. చివరకు సుఖ దుఃఖాది ఫలాలుగా మారుతున్నాయి. అవి మరలా మన జ్ఞానానికే అనుభవానికి వస్తున్నాయి. అనుభవిస్తే అవి మన జ్ఞానంలోనే లయమయి పోతున్నాయి. అవి వృత్తిరూపంగా ఉదయించక ముందూ ఉంది జ్ఞానం. అవి మరలా వచ్చి తనలో కలిసి పోతున్నప్పుడూ ఉంది. అవునా లేదా చెప్పండి. కాబట్టి కర్మలన్నీ జ్ఞానంతో సమాప్త మయ్యేవే.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః || 34 ||
కాబట్టి ఎప్పటికైనా జీవితంలో సాధకుడైన వాడు చేయవలసిన కర్తవ్యమా కర్మలూ ఈ ఉపాసనలూ - యోగాభ్యాసాలూ - కావు. అవి ఎన్ని చేసినా వాటి వల్ల జీవిత సమస్య పరిష్కారం కాదు. స్వర్గాదిలోకాలకు పోయి ఉత్తమ భోగా లనుభవించినా మరలా ఉత్తమ జన్మలెత్తి ఉత్తమమైన జీవితం సాగించినా సంసారమేగాని అది సాయుజ్యం కాదు సమస్య
Page 351