జ్ఞాన యోగము
భగవద్గీత
దిప్పుడు ఆరంభ మయిందని అర్థం. అందుకే మామూలు యజ్ఞాలన్నీ ఫలారం భాకాలు. అనుభవిస్తే ఆ ఫలం ఖర్చయి పోతుంది కూడా. అయితే తక్షణం స్వర్గాది లోకాల నుంచి ఉద్వాసన చెబితే వచ్చి మరలా భూమి మీద పడే ప్రమాదం కూడా ఉంది వాటిలో.
పోతే ఇలాటి ఉపద్రవం లేనిది జ్ఞానయజ్ఞ మొక్కటే. జ్ఞానమే యజ్ఞమిక్కడ. యజ్ఞంగాని యజ్ఞం. ఇది వాటిలాగా ఫలారంభకం కాదు. ఎందుకుగాదు. అవి స్వర్గమనే ఫలాన్ని తయారుచేసినట్టే ఇది కూడా మోక్ష ఫలాన్ని తయారు చేస్తుంది గదా. పొరబాటు. మోక్షమనేది స్వర్గాదుల లాగా తయారయ్యేది కాదు. సిద్ధ మయింది. సాధ్యంకాదు. నీవు గుర్తించినా గుర్తించకున్నా దాని పాటికది వస్తు సిద్ధంగా ఉన్నది. మరి జ్ఞానం చేసే పనేమిటి. ఉన్నదే నీ అజ్ఞానం వల్ల మరుగు పడి ఉంటే దాని తాలూకు జ్ఞానం సంపాదించి చూస్తే ఉన్నదే మరలా దర్శన మిస్తున్నది. చీకట్లో నీవు గుర్తించకున్నా లేక సర్పమని మరొక రూపంగా గుర్తించినా అక్కడ ఉన్నది రజ్జువే. అదినీవు సర్పమని చూస్తున్నంతవరకూ మరుగున పడి ఉందంత మాత్రమే ఎప్పుడు దీపం పెట్టి చూచావో అప్పుడది బయటపడి కనపించింది. అది నీవున్నదని తెలుసుకొన్నావే గాని క్రొత్తగా సృష్టించ లేదు కదా. It is only Discovery not creation. అలాగే ఇక్కడా మోక్షమనేది క్రొత్తగా సృష్టి అయ్యేదికాదు. అజ్ఞానంలో కనపడక జ్ఞానంలో దర్శన మిస్తున్న దంత మాత్రమే.
Page 349