#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే || 33 ||

  మరి ఈ యజ్ఞాలన్నీ ఏదో ఒక ఆదర్శం పెట్టుకొని చేసే మంచి కార్యాలే గదా. అవి పనికిరావని చాటటం దేనికి. ఎలా పనికిరావని ప్రశ్న వస్తున్నది. దానికి జవాబిది. శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ - ఇవన్నీ ఎన్నైనా చెప్పు. అవి కేవలం ద్రవ్యయ జ్ఞాలే. Material Sacrifices. యజ్ఞకుండం - సమిధలూ అగ్నిహోత్రాలూ - ఇలాంటి యజ్ఞంగాలన్నీ జడపదార్ధాలు. ద్రవ్యాలే గాక ఆ చేసే క్రియకూడా జడమే. ఒకటి కదలని జడమైతే మరొకటి కదిలే జడం. అవి శుద్ధమైన చైతన్యాన్ని అందివ్వగలవా మనకు. ఆత్మజడం గాదు. చేతనం. అది చలం కాదు. అచలం.కాగా ఇలాటి ద్రవ్యయజ్ఞా లేమిటి. అలాటి ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదించట మేమిటి - అసంభవం.

  కనుకనే ద్రవ్యమయమైన యజ్ఞం మోక్షసాధనానికి తోడుపడలేదు. మరి ఏది మోక్షసాధనం. జ్ఞానయజ్ఞం. ద్రవ్యయజ్ఞం ఫలారంభకమైతే జ్ఞానయజ్ఞం ఫలారంభకం కాదంటారు గురువుగారు. ఫలమంటే స్వర్గాదులూ అక్కడ కలిగే భోగాలూ. అవి యజ్ఞం చేయనంతవరకూ ఎక్కడా సిద్ధంగా లేవీ సృష్టిలో. చేస్తే క్రొత్తగా తయారవుతా యట. అంచేతనే యజ్ఞ ఫలాన్ని అపూర్వ మంటారు కర్మ మీమాంసకులు. పూర్వం లేని

Page 348

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు