#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  అందుకే మానవ జీవితాని కేదో ఒక గమ్యం చూపటానికే శాస్త్రం మొదట మన అధికార తారతమ్యాన్ని బట్టి ఆయా కర్మ లుపదేశించింది. వితాతా బ్రహ్మణో ముఖే - బ్రహ్మ మంటే ఇక్కడ వేదమని అర్ధం. ముఖమంటే ద్వారం Medium వేదం ద్వారా బహువిధా యజ్ఞా వితతాః - అనేక విధాలైన యజ్ఞయాగాది కర్మలు సవిస్తరంగా వర్ణించబడ్డాయి. వాటి వాటి ఫలితాలు కూడా వేదమే వర్ణించి చెప్పింది. జ్యోతిష్టో మేన స్వర్గకామో యజేత - జ్యోతిష్టోమ యాగం చేస్తే నీకు స్వర్గం లభిస్తుందని చెబుతున్నది. ఇలాంటి వెన్నో కర్మలూ వాటి ఫలశ్రుతులూ.

  అయితే ఇవన్నీ ఆచరిస్తూ పోతే చాలు. ఇక జ్ఞానమక్కర లేదు. స్వర్గంలాగే మోక్షం కూడా వచ్చి ఒళ్లో బడుతుందని మాత్రమెప్పుడూ బోల్తా పడరాదు. ఎందుకంటే మోక్షం కర్మవల్ల రాదు. దానికి కావలసిన సాధనం జ్ఞానమెక్కటే. మరి ఈ యజ్ఞయాగాది క్రియలో. కర్మ జాన్ విద్ధితాన్ సర్వాన్ ఇవన్నీ కర్మజన్యాలు. కాయిక వాచిక మానసికమైనవే ఏ కర్మలైనా. అవి కూడా అచేతనమైనవీ. విశేష రూపమైనవీ. చలనమే విశేషం. మనసూ వాక్కూ - శరీరమూ చలించకుండా ఏ కర్మ అయినా చేయగలవా. ఇలా చలనాత్మకమైన యజ్ఞయాగాది కర్మలు ఆత్మను పట్టుకోటానికెలా సాధనంకాగలవు. నిర్వ్యాపారోహి ఆత్మా. ఆత్మ అంటే అది పరిపూర్ణమైన సర్వవ్యాపకమైన జ్ఞానం. నిరాకారమూ వ్యాపకమూ ఎప్పుడయిందో

Page 346

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు