జ్ఞాన యోగము
భగవద్గీత
ఇంత ఉన్నది తేడా ఇద్దరికీ. అంటే ఏమన్న మాట. కర్మ కర్మ మార్గంలో ఉండగానే నీకు మోక్షమివ్వదు. అది క్రమంగా జ్ఞానంగా మారినప్పుడే తద్ద్వారా మోక్షమనేది సిద్ధిస్తుంది. అయితే ఒక్కమాట. ముందు ఉట్టికెక్కి తరువాత స్వర్గానికి. ఉట్టి ఎక్కటం లాంటివీ యజ్ఞాలన్నీ మరీ బేహోదాగా పశుప్రాయంగా బ్రతికితే ఏ ఫలితమూ లేదు జీవితానికి. ఏదో ఒక ఆదర్శం పెట్టుకొని బ్రతికితేనే అది సఫలమైన జీవితం. అది మొదట క్రియారూపంగా నడచినా తరువాత వారి పాటికి వారికే విసుగుపుట్టి అసలైన ఆత్మజ్ఞానానికే ప్రయత్నిస్తారు. అంతవరకూ మనమెంత హితబోధ చేసినా వారి బుర్రకెక్కదు. చేసేది మంచిపనే గదా అని వాణ్ణి వదిలేయాలి. వారే కొంతకాలానికి దారికి వస్తారు.
అలా ఎప్పటికీ రాని మానవుడు వేరే ఉన్నాడు. వాడు జ్ఞాని కాడు. కర్మి కాడు. నాయం లోకోస్త్య యజ్ఞస్య - కుతోన్యః కురు సత్తమ ఇప్పుడు చెప్పిన యజ్ఞాలలో ఏ యజ్ఞమూ చేయక మామూలుగా పశుప్రాయంగా బ్రతుకు సాగించేవాడి కిటు ఇహమూ లేదు. అటు పరమూ లేదు. ఇహ జీవిత మిక్కడే వాడు కన్ను మూస్తే నశిస్తున్నది. పరాని కసలు వాడే ప్రయత్నమూ చేయలేదు కాబట్టి అదీ దక్కకుండా పోతున్నది. పురుషార్ధానికే తరంగాని పురుషుడు వాడు.
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే || 32 ||
Page 345