#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  శ్రోత్రాదులంటే త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణాలనే ఇంద్రియాలు. వాటికి సంబంధించినవే శబ్ద స్పర్శ రూపరసగంధాలనే విషయాలు. Objects. ఇంద్రియాలు వాటి వాటి విషయాలలో వదిలేస్తే విచ్చల విడిగా సంచరిస్తుంటాయి. మన అదుపులో ఉండవు. మనలనూ లాగేస్తాయి ఆ విషయాలలోకి. అలా కాకుండా వాటి వ్యాపారాల నరికట్టి సంయమమనే అగ్నిలో హోమం చేస్తారట కొందరు. వారికదే యజ్ఞం. సంయమమంటే నిగ్రహ Control మని అర్ధం.

  శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అలా కాక మరికొందరు శబ్దాదులైన విషయాలనే పట్టుకు వచ్చి ఇంద్రియాలనే అగ్నిహోత్రంలోనే హోమం చేయటానికి యత్నిస్తారట. మొదటిది లోపలి ఇంద్రియ వ్యాపారాలు బయటికి రాకుండా చూడటమైతే రెండవది బయటి విషయాలను లోపలికి తీసుకొనే ప్రయత్నం. అయితే ఇంద్రియ వ్యాపార మసలే సాగకపోతే ఎలాగా అది సంభవమా అనే ప్రశ్న వస్తే సాగవచ్చు. కాని శ్రోత్రా దిభి ర విరుద్ధ విషయగ్రహణం హోమం మన్యంతే. ఆయా ఇంద్రియాలు నిషిద్ధమైన విషయాల మీదికి పోకుండా నిరోధించటమే గాని అవిరుద్ధమైన వాటి విషయంలో ప్రవర్తించ వచ్చునని రాజీ చేశారు భాష్యకారులు.

Page 337

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు