#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

చెప్పినా అది సామానాధి కరణ్యమే. రెండింటినీ ఏకమని చెప్పటానికి సామానాధికరణ్య Equation మని పేరు. అందులో అర్పణాదులన్నీ బ్రహ్మ స్వరూపమని భావించటమే సమంజసం గాని బ్రహ్మ మర్పణాదులుగా భావించటం కాదు. కారణ మేమంటే మొదటి దానిలో ఇవన్నీ బ్రహ్మంలో లయం చేసి బ్రహ్మమనే ఏకైకమైన తత్త్వాన్నే భావించవచ్చు. అలా కాక ఆ బ్రహ్మమే ఈ రూపాలలో కనిపిస్తున్నదంటే ఏకైకమైన తత్త్వమనేక రూపాలుగా భావించవలసి వస్తుంది. అనేకత్వం సమస్యేగాని పరిష్కారం కాదు. పరిష్కార మెప్పుడూ ఏకంగా భావించటమే. అందుకే జీవజగత్తులను బ్రహ్మాకారంగా దర్శించమని చెబుతుందే గాని శాస్త్రం బ్రహ్మాన్ని జీవజగత్తు లుగా చూడమని బోధించదు. జీవ జగద్భావన ఇప్పుడే ఉందిగా మనం దరికీ ఇప్పుడు క్రొత్తగా బోధించటందేని కా విషయం మనకు శాస్త్రం. అలా బోధించినా అది మన సమస్యకు పరిష్కారం కాదుగా. అనేక త్వమే మనకున్న సమస్య. సమస్య పోగొట్టటమే శాస్త్ర కర్తవ్యం. అంతేగాని దాన్ని ఇంకా పెంచి పోషించటం కాదు. కనుక మేము చెప్పిందే సరియైన వ్యాఖ్య అంటారు స్వామివారు.

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి || 25 ||

  ఇలాంటి సరియైన చక్కని రాజమార్గంలో అర్ధం చేసుకోలేక ఒక్కొక్క రొక్కొక్క యజ్ఞాన్ని పట్టుకొని ఊరేగుతున్నారు. అవన్నీ కర్మ యజ్ఞాలూ

Page 335

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు