జ్ఞాన యోగము
భగవద్గీత
భాస. ఒక నాటకం. ఆభాస అయినా చేస్తున్నాడుగదా. ఎందుకా చేయటం. దానివల్ల ఏమిటి ప్రయోజనం. ఏదీ లేదు వాస్తవానికి. అయినా అడుగుతున్నావు కాబట్టి రెండే ప్రయోజనాలు కర్మకు. ఒకటి వాడా ప్రారబ్ధం వాడి ద్వారా అలా పని చేస్తున్నది. దాని బాకీ అలా తీర్చుకొంటున్నాడు. మరొకటి వాడా కర్మమూలంగా జిజ్ఞాసు లోకాన్నైనా ఉద్దరిస్తుంటాడు. ఒకటి ప్రారబ్ధఫలానుభవం. ఇంకొకటి లోక సంగ్రహం. ఇంతే. ఇంకొక ప్రయోజన మంటూ లేదు. ఇది కూడా ఇతరుల దృష్టికే వాడి దృష్టికి కాదు.
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషమ్ || 21 ||
ఇతరుల దృష్టికే గాని జ్ఞాని దృష్టికేదీ లేదంటున్నారు. కాని మాకనుమానమే. ఉపాధి ఉన్నంతవరకూ కర్మ అనేది లేకుండా పోదెవడికైనా. కర్మ వల్లనే ఏర్పడ్డదది. కర్మ కోసమే ఉన్నది. అది ఉన్నంత వరకూ కర్మ చేయక తప్పదు గదా. కర్మ తప్పదంటే కర్మకు తాను కర్తృత్వం వహించకా తప్పదు గదా. మరి సాక్షి అనే మాట కర్ధమేముంది. జ్ఞానం లేదని చెప్పము గాని జ్ఞానంతో పాటు కర్మ కూడా ఉందని చెప్పండి. లేదంటే అది అనుభవ విరుద్ధం. ఎవరికి. లోకానికే కాదు. జ్ఞానికే. దీనికేమిటి మీరిచ్చే సంజాయిషీ అంటే ఇస్తున్నాడిప్పుడు.
Page 327