#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

ప్రశ్న. కర్మ కాదు దగ్ధమయింది. కర్మఫలం. అది కర్తృత్వముంటేనే ఏర్పడుతుంది. దానికి కామం మూలం. జ్ఞాని కదిలేదు. కామాన్ని మొక్కలోనే త్రుంచి వేశాడు వాడు. అంచేత కర్తృత్వం పోయింది. కర్తృత్వం పోతే భోక్తృత్వం కూడా తొలగిపోతుంది. రెండు కోరలూ పెరికి వేసిన కాలసర్ప మప్పుడు కర్మ. యాంత్రికంగా జరగటమేమో జరుగుతుంటుంది. కాని ఫలితంలేదు. కాబట్టి జరిగినా జరగని దానితో సమానమే.ఇందులో జరుగుతున్నది కాబట్టి జ్ఞాని కూడా అందరితో పాటు కర్మ చేస్తున్నాడనీ చెప్పవచ్చు. ఫలితం లేక నిర్వీర్యమయి పోయింది కాబట్టి చేసినా చేయటం లేదనీ చెప్పవచ్చు. ఇదీ సమాధానం.

  అందుకే వర్ణిస్తున్నాడిప్పుడు త్వక్త్వా కర్మ ఫలాసంగం. కర్మఫలం తనకనుకూలమైనా ప్రతికూలమైనా జ్ఞాన దృష్టితో చూస్తుంటాడు కాబట్టి దాన్ని పూర్తిగా వదిలేసి నిత్య తృప్తః - వదిలేసినా నిత్యమూ తనలోతాను తృప్తిగా కాలం గడుపుతూ నిరాశ్రయః - పురుషార్ధాన్ని పొందటానికని ఏసాధనాన్నీ పట్టుకోకుండా ఎవడు నిరామయంగా కనిపిస్తాడో వాడు నిజమైన ఆత్మజ్ఞాని.

  కర్మణ్యభి ప్రవృత్తోపి. అలాంటి జ్ఞాని ప్రారబ్ధం కొద్దీ జీవితంలో ఎప్పుడే కర్మలో ప్రవర్తించినా ప్రవర్తించవచ్చు గాక. నైవకించి త్కరోతి సః అలా ప్రవర్తించినట్టు ఆ పనిచేస్తున్నట్టు నీకు కనిపిస్తుందేగాని నిజంలోవాడు ప్రవర్తించటంలేదు. ఏ కర్మా చేయటమూ లేదు. అంతా ఆ

Page 326

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు