#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || 19 ||

  అంత దూరం దేనికి. అసలిప్పుడే నిరూపణ చేస్తున్నదా విషయమీ శ్లోకం మనకు. సమారంభాః అంటే ఏది ఆరంభిస్తామో అది. కర్మలని అర్ధం. సర్వే సమారంభాః - మనం చేసే సమస్త కర్మలు. సమస్తమంటే మానసిక వాచిక కాయిక కర్మలన్నీ. యస్య ఎవడికైతే. కామ సంకల్ప వర్జితాః - కామసంకల్పాలు రెండూ లేకుండా పోతాయో. కామానికి మూలం సంకల్పం. కామ జానామి తేమూలం సంకల్పాత్కిల జాయసే అని మహాభారతం. సంకల్పం కారణమైతే కామం దానికి కార్యం. మొదట ఒకటి పొందాలనే సంకల్ప మేర్పడుతుంది. దానివల్ల ఆ పదార్ధాన్ని పొందే 5.The Thought and Desire to possess a thing. ఇవి రెండే కర్మకు ప్రాణం. ప్రచోదకం. ఇవి లేకుండా పోతే ఆ కర్మకూ ఫలితం లేదు. ముధైవ చేష్టా మాత్రా అన్నారు గురువుగారు. ఒక యాంత్రికమైన చేష్ట Mere function అది.

  ఒక జ్ఞాని తన దైనందిన జీవితంలో ఏ కర్మ ఎప్పుడు చేసినా అలాంటి యాంత్రికమైన వ్యాపారమది. అది వాడి జ్ఞాన ప్రకాశంలో కదిలే నీడలాంటిదే ఆ కర్మ. కనుక జ్ఞానం కన్నా దానికి స్వతంత్రమైన సత్తా Existance లేదు. జ్ఞాన సత్తాయే దాని సత్తా. అంచేత ఏ కర్మ చేసినా నిష్కామంగా చేస్తాడు కాబట్టి జ్ఞాని కది ఫలితమివ్వదు. ఇవ్వలేదు.

Page 324

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు