#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

భావించటం. అంతే కాదు. కృత్స్నకర్మకృత్ ఒకటి కూడా బీరు పోకుండా అన్ని పనులూ చేసినవాడూ వాడేనట. స్వరూప భావనలోనే అన్ని కర్మలూ ఇమిడి ఉన్నాయి కాబట్టి అవి చేసినా సరే చేయకున్నా సరే. చేసినట్టే అవుతుంది. జలం తరంగంగా ప్రసరించినా ప్రసరించకపోయినా రెండూ జలదృష్టితోనే చూచేవాడి కాజల స్వరూపంలోనే రెండూ కలిసి వస్తాయా లేదా. అలాగే జ్ఞానదృష్టితో చూచేవాడికి జ్ఞానమూ జ్ఞానమే కర్మా జ్ఞానమే. తేడా కనిపించదు.

  ఇక్కడ బుద్ధిమాన్ అనేచోట జ్ఞానమూ - యుక్తః అనేచోట యోగమూ - కర్మకృత్ అనేచోట కర్మా - మూడూ ఒకడిలోనే ఉన్నాయని వర్ణించటం వల్ల ఎవడు జ్ఞానవంతుడోవాడే సమాధి శాలీ వాడే కర్మ శాలీ కర్మసమాధులు జ్ఞానంకన్నా అన్యంగా లేవని అర్ధమవుతున్నది. అంతేకాదు. జ్ఞానంతో చేసిందే అసలైన సమాధి. జ్ఞానంతో చేసిందే అసలైన కర్మ. జ్ఞానమనే పునాది లేకుంటే వాటికస్తిత్వం లేదనీ తెలిసిపోతున్నది. అంతేకాదు. ఏ కర్మ చేసినా అది జ్ఞానదృష్టి వదలకుండా చేస్తేనే ఫలితమిస్తుంది. ఏ సమాధి యోగమైనా జ్ఞానదృష్టితో అవలంబిస్తేనే దానికి విలువ వస్తుందని కూడా బోధపడుతున్నది. అసలు జ్ఞానమే వస్తువు. మిగతావన్నీ దాని ఆ భాస. ఆ భాస వస్తువు కన్నా వేరుగా లేనట్టే జ్ఞానం కన్నా వేరుగా కర్మ లేదు సమాధి లేదు. అవి కూడా జ్ఞాన స్వరూపమే దాని సంస్థానమే ననేది అసలైన సత్యం. ఇది సర్వం కర్మాఖిలం పార్ధజ్ఞానే పరిసమాప్యతే అనే శ్లోకం దగ్గర ఇంకా చక్కగా తెలిసిపోతుంది మనకు.

Page 323

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు