#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

లేదు. కాబట్టి విషయ రూపమైన అనుష్ఠానమూ లేదు. విషయంగా భావించే దేవతలూ లేరు.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || 13 ||

  అయితే ఏమిటీ వింత. మానవ జన్మ ఎత్తి అంతో ఇంతో జ్ఞానవంతుడైన మానవుడే ఎందుకింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అంతా భగవత్స్వరూపమే నని ఎందుకు గుర్తించలేక పోతున్నాడు. నేనీ పనిచేస్తే వారు సంతోషించి నా కోరికలన్నీ నెరవేరుస్తారని ఎందుకు కలగంటున్నాడు. ఎందుకోస మిన్ని కర్మలు చేయలేక సతమత మవుతున్నాడని ప్రశ్న వస్తున్నది. దీనికిప్పుడు సమాధాన మిస్తున్నాడు. చూడండి పరమాత్మ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం - గుణకర్మ విభాగశః అసలు సంగతేమంటే మానవు లందరినీ నేనే సృష్టించినా అందరూ ఒకే విధంగా సృష్టి కాలేదు. అందులో నాలుగు తరగతు లున్నాయి. వాటికి వర్ణాలని పేరు. కొందరు బ్రాహ్మణులు. కొందరు క్షత్రియులు. మరికొందరు వైశ్యులు. ఇక కొందరు శూద్రులు. అందరూ నాసృష్టే అయినా అందులో ఈ తేడా ఏర్పడింది. తేడాగా ఎందుకు సృష్టించారని నన్నడుగుతారేమో. నా తప్పేమీ లేదందులో. మరి ఎవరిది తప్పు. గుణకర్మ విభాగశః వారి వారి గుణాలూ - కర్మలూ ఇవి రెండే దానికి కారణం.

Page 305

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు